ETV Bharat / business

బడ్జెట్​ 2020: గిన్నెలు, ఫ్యాన్ల ధరలకు రెక్కలు - Customs duty on imported wall fans, tableware, kitchenware hiked

గిన్నెలు, ఫ్యాన్లు, వంట సామగ్రిపై కస్టమ్స్​ సుంకాలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వీటిపై 20శాతం సుంకాలు విధించనున్నట్టు బడ్జెట్ 2020​లో ప్రకటించారు నిర్మలా. వైద్య పరికరాలపై నామమాత్రపు హెల్త్​ సెస్​ విధించాలని ప్రతిపాదించారు.

Customs duty on imported wall fans, tableware, kitchenware hiked
బడ్జెట్​ 2020: గిన్నెలు, ఫ్యాన్ల ధరలకు రెక్కలు
author img

By

Published : Feb 1, 2020, 4:08 PM IST

Updated : Feb 28, 2020, 6:59 PM IST

దిగుమతి చేసుకున్న ఫ్యాన్లు, గిన్నెలు, వంట సామగ్రిపై కస్టమ్స్​ సుంకాలను పెంచుతున్నట్టు బడ్జెట్​లో ప్రకటించారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​.

వెన్న తీసిన పాలు(స్కిమ్మిడ్​ మిల్క్​), పలు మద్యపానీయాలు, సోయా ఫైబర్​, సోయా ప్రొటీన్​, పంచధార, పాడి ఉత్పత్తులపై ఉన్న సుంకాల మినహాయింపును ఉపసంహరించుకున్నట్టు నిర్మల వెల్లడించారు.

ఫ్యాన్లపై ఇంతకు ముందు 7.5శాతంగా ఉన్న కస్టమ్స్​ సుంకాలు... తాజాగా 20శాతానికి పెరిగాయి. పింగాణీ, చైనా సిరామిక్​, ఉక్కు, రాగితో చేసిన గిన్నెలు-వంటసామగ్రిపై సుంకాలను 20శాతానికి పెంచింది కేంద్రం.

నామమాత్రపు హెల్త్​ సెస్​...

వైద్య పరికరాలపై నామమాత్రపు హెల్త్​ సెస్​ను విధించాలని నిర్మల ప్రతిపాదించారు. దీని వల్ల దేశీయ వైద్య పరికరాల రంగానికి ఊతమందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వైద్య పరికరాల కోసం ఒకప్పుడు దిగుమతులపైనే ఆధారపడిన భారత్​... ఇప్పుడు సొంతంగా తయారు చేసుకోవడమే కాకుండా విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని హర్షం వ్యక్తం చేశారు.

ఈ హెల్త్​ సెస్​తో వచ్చే ఆదాయాన్ని జిల్లాల్లోని ఆరోగ్య కేంద్రాల మౌలిక వసతులకు ఉపయోగించనున్నట్టు పేర్కొన్నారు ఆర్థికమంత్రి.

Last Updated : Feb 28, 2020, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.