ఇరాన్ నిఘా విభాగాధిపతి లక్ష్యంగా అమెరికా వైమానిక దాడులు చేసిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు 4 శాతం మేర పెరిగాయి. ఫలితంగా బ్యారెల్ ధర రూ.4,514లకు పెరిగింది.
ట్రంప్ ఆదేశాల మేరకు ఇరాక్‌లో జరిగిన ఈ దాడుల్లో ఇరాన్ అత్యున్నత సైనికాధికారి సహా పలువురు అధికారులు మరణించారు. ప్రపంచంలో అతి పెద్ద చమురు సరఫరాదారులైన ఈ రెండు దేశాలపై దాడి జరిగిన నేపథ్యంలో ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్
శుక్రవారం నాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ ముడి చమురు ధర 2.96 శాతం పెరిగి బ్యారల్ 68.21 డాలర్లను చేరుకుంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ (డబ్ల్యూటీఐ) ముడిచమురు ధర 2.81 శాతం పెరిగి 62.90 డాలర్లకు పెరిగింది.
భారత్‌పై తీవ్ర ప్రభావం
భారత్ తన ఇంధన అవసరాల్లో 80 శాతానికి పైగా అంతర్జాతీయ దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా ఇరాన్.. భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉంది. ఇప్పుడు ఆ దేశంపై అమెరిగా దాడులు చేయడం వల్ల... భారత్‌లో చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇదీ చూడండి: అమెరికా వైమానిక దాడితో స్టాక్‌మార్కెట్లకు నష్టాలు