ETV Bharat / business

వ్యాక్సిన్​తో భారత​ ఫార్మాకు రూ.81 వేల కోట్ల మార్కెట్​! - భారత్​లో అందుబాటులో ఉన్న కొవిడ్ వ్యాక్సిన్​లు

కరోనా వ్యాక్సిన్​ దేశీయ సరఫరా, ఎగుమతుల ద్వారా భారత ఔషధ రంగం రానున్న మూడేళ్లలో రూ.81 వేల కోట్ల వ్యాపారం చేసే వీలుందని ఓ నివేదిక అభిప్రాయపడింది. వచ్చే ఏడాది మార్చి వరకు దేశీయంగా వ్యాక్సినేషన్ దాదాపు పూర్తవుతుందని అంచనా వేసింది.

India Vaccine Market
వ్యాక్సిన్ మార్కెట్​
author img

By

Published : Aug 17, 2021, 2:22 PM IST

Updated : Aug 17, 2021, 7:41 PM IST

భారత ఔషధ రంగానికి కొవిడ్​-19 వ్యాక్సిన్​ భారీ వ్యాపార అవకాశాన్ని తెచ్చిపెట్టే సూచనలు కన్పిస్తున్నాయి. రానున్న మూడేళ్లలో దేశీయ సరఫరా, వివిధ దేశాలకు ఎగుమతుల ద్వారా ఈ రంగం 10 బిలియన్ డాలర్ల నుంచి 11 బిలియన్ డాలర్ల వ్యాపారం చేసే వీలుందని కేర్​ రేటింగ్స్​ నివేదిక అంచనా వేసింది.

ధరల్లో భారీ వ్యత్యాసం..

అయితే అమెరికాకు చెందిన బహులజాతి ఔషధ సంస్థల్లా.. అధిక ధరల ఫలితాలను భారత్​ ఆస్వాదించడం కష్టమేనని నివేదిక వివరించింది.

అమెరికా ఫార్మా కంపెనీలు కరోనా వ్యాక్సిన్​ ఒక డోసు ధరను 15 డాలర్ల నుంచి 25 డాలర్లుగా ఉంచాయి. భారత కంపెనీలు మాత్రం ఒక డోసు ధరను 3.25 డాలర్ల నుంచి 3.50 డాలర్ల వరకు వద్ద మాత్రమే ఉంచాయని నివేదిక పేర్కొంది.

ఈ నేపథ్యంలో.. భారత ఫార్మా రంగానికి వచ్చే మూడేళ్లలో 10-11 బిలియన్​ డాలర్ల(దాదాపు రూ.81వేల కోట్లు) విలువైన కొవిడ్​ వ్యాక్సిన్ సరఫరాకు అవకాశాలు (దేశీయంగా, ఎగుమతులు కలిపి) ఉన్నట్లు నివేదిక అభిప్రాయపడింది.

ఆ దేశాల నుంచి భారీ డిమాండ్​..

దేశీయంగా 2022 మార్చి నాటికి టీకా మెజారిటీ డిమాండ్​ పూర్తవుతుందని అంచనా వేసింది ఈ నివేదిక. ఐరోపా, ఉత్తర అమెరికా, అభివృద్ధి చెందిన ఆసియా దేశాలకు టీకా ఎగుమతి చేసే అవకాశాలు మెండుగా ఉన్నట్లు వివరించింది.

చైనా, జపాన్​, పలు దక్షిణ అమెరికా దేశాలు మినహా.. ఆఫ్రికా, ఆసియా దేశాల్లో వ్యాక్సినేషన్​ నెమ్మదిగా కొనసాగుతోందని నివేదిక పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో వ్యాక్సిన్​ డిమాండ్​ 1.25 బిలియన్​ డాలర్ల కన్నా ఎక్కువగా ఉండొచ్చని అభిప్రాయపడింది.

ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం.. ఆగస్టు 10 నాటికి ప్రపంచవ్యాప్తంగా 4.35 బిలియన్​ డోసులు వినియోగమయ్యాయి. అమెరికా, చైనా, ఐరోపా దేశాల్లో వ్యాక్సిన్​ తీసుకునేందుకు అర్హులైన వారిలో 50 శాతం మందికి కనీసం ఒక డోసు వ్యాక్సినేషన్ పూర్తయినట్లు తెలిసింది.

అప్పుడే ప్రపంచం సేఫ్​..

అయితే ప్రపంచవ్యాప్తంగా 70 శాతానికిపైగా ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తయితేనే కరోనా నుంచి సురక్షిత వాతావరణం నెలకొంటుందని కేర్ నిపుణులు చెబుతున్నట్లు​ రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది.

భారత్ విషయానికొస్తే.. ఆగస్టు 10 నాటికి దేశవ్యాప్తంగా 50 కోట్ల మంది అర్హులు కనీసం ఒక డోసు టీకా తీసుకున్నారు. దేశంలో సంపూర్ణ వ్యాక్సినేషన్​ పూర్తయ్యేందుకు ఇంకా కనీసం 200 కోట్ల డోసులు అవసరమవుతాయని అంచనాలున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజుకు 50-55 లక్షల మంది వ్యాక్సిన్​ తీసుకుంటున్నారు. డిమాండ్ భారీగా ఉన్నప్పటికీ సరఫరా తగినంత లేకపోవడం వల్ల చాలా రోజులుగా వ్యాక్సినేషన్​ స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

దేశంలో ప్రస్తుతం ఐదు వ్యాక్సిన్​లు అత్యవసర వినియోగంలో ఉన్నాయి. మరో మూడు వ్యాక్సిన్​లు వినియోగ అనుమతుల దశలో ఉన్నాయి.

ఇదీ చదవండి: యువత.. పెట్టుబడులు పెడుతున్నారా?

Last Updated : Aug 17, 2021, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.