ETV Bharat / business

కరీంనగర్​ గ్రానైట్ పరిశ్రమపై కరోనా ప్రతాపం - కరీంనగర్​ గ్రానైట్ పరిశ్రమపై కరోనా ప్రతాపం

గ్రానైట్ పరిశ్రమ అనగానే ముందుగా గుర్తుకువచ్చేది కరీంనగర్​ జిల్లా. ఇక్కడి గ్రానైట్‌ పరిశ్రమ స్థానికులకే కాదు.. ఇతర రాష్ట్రాల కార్మికులకూ ఉపాధి కలిపిస్తోంది. స్థానికంగా ఉన్న క్వారీలు, గ్రానైట్‌ పాలిషింగ్‌ యూనిట్లు... వేలాది కుటుంబాల కడుపు నింపుతున్నాయి. వీటికి అనుబంధంగా ఉన్న రవాణా, మెకానిక్‌, పెట్రోల్‌ బంకులపై వేలాది మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కరోనా దెబ్బకు ఇప్పుడు ఈ రంగం కుదేలైంది. వ్యాపారుల, కార్మికుల ఆర్థిక పరిస్థితులపై దెబ్బ కొడుతూ దాదాపు లక్షమంది ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

coronavirus
coronavirus
author img

By

Published : May 12, 2020, 6:24 AM IST

రంగం ఏదైనా.. సంక్షోభానికి కారణం మాత్రం కరోనానే. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గ్రానైట్ పరిశ్రమపైనా తన ప్రతాపం చూపిస్తోంది. లక్ష మంది ఉపాధిని దెబ్బతీస్తోంది. కారణం.. కరీంనగర్‌ జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమల నుంచి ఎగుమతులన్నీ దాదాపు చైనాకే వెళ్లుతుంటాయి. చైనా నుంచి వచ్చే వ్యాపారులు కరీంనగర్‌లో గ్రానైట్ రాళ్లను ఎంపిక చేసుకొని వెళ్తే ఇక్కడి నుంచి పెద్ద పెద్ద గ్రానైట్‌ రాళ్లను బ్లాక్‌లుగా కట్ చేసి.. కాకినాడ, విశాఖ, చెన్నై పోర్టు ద్వారా చైనాకు తరలిస్తుంటారు. ఈ ప్రక్రియ దాదాపు 4 నెలలుగా నిలిచిపోవడంతో వ్యాపారులు, కార్మికులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

ఇక్కడి నుంచి చైనాకు

కరీంనగర్ గ్రానైట్‌కు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉంది. నాణ్యతతో పాటు... తక్కువ ధరకే లభించడంతో ఇక్కడి గ్రానైట్​ను చైనా ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. 2008లో ఒలింపిక్స్ సందర్భంగా స్థానికంగా ఉన్న ఒద్యారం గ్రామంలోని గ్రానైట్​ను చైనా ప్రభుత్వం... పెద్ద ఎత్తున కొనుగోలు చేసింది. నాటి నుంచి ఈ ప్రాంతంలో లభించే టాన్ బ్రౌన్, మెపిల్ బ్రౌన్ గ్రానైట్​కు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఇక్కడి గ్రానైట్‌ను చైనా, జపాన్‌ సహా ఇతర ఆసియా దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి.

రూ.500కోట్ల వ్యాపారం

దాదాపు 90 శాతం గ్రానైట్ చైనాకే ఎగుమతి అవుతోంది. మంచి లాభాలు రావటంతో స్థానికంగా గ్రానైట్‌ పరిశ్రమకు డిమాండ్ ఏర్పడింది. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 250కి పైగా గ్రానైట్ పరిశ్రమలు వెలువగా... ఉమ్మడి జిల్లాలో 500కు పైగా పరిశ్రమలు గ్రానైట్‌ను అందిస్తున్నాయి. 500 కోట్ల రూపాయల వ్యాపారం సాగుతోంది. రవాణా ద్వారా దక్షిణ మధ్య రైల్వేకూ భారీగానే ఆదాయం సమకూరుతోంది. ఈ గ్రానైట్ ఎగుమతి కోసం కరీంనగర్​లోనే కాక.. గంగాధర, ఉప్పల్ రైల్వేస్టేషన్‌లలో ప్రత్యేక ప్లాట్‌ఫాంలు నిర్మించారు.

సంక్షోభం దిశగా

ప్రతినెల కరీంనగర్ జిల్లా నుంచి 24 వేల క్యూబిక్ మీటర్ల నుంచి 30 వేల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ రాయి చైనాకు ఎగుమతి అవుతుందని అంచనా. ఈ పరిశ్రమల్లో తెలుగురాష్ట్రాల వారే కాక మహారాష్ట్ర, ఛతీస్‌గఢ్, బిహార్, ఒడిశా, తమిళనాడులకు చెందిన వలస కార్మికులు పని చేస్తున్నారు. ఉపాధి పొందుతూ బతుకు బండి లాగిస్తున్నారు. ఇక్కడి పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులు నిత్యం పనిచేస్తూ ఉండటంతో... లారీల వారికి ఉపాధి దొరికేది. గ్రానైట్‌ ఎగుమతులు జోరుగా సాగేవి. అలాంటి గ్రానైట్ పరిశ్రమ ఇప్పుడు కరోనా ప్రభావంతో సంక్షోభం దిశగా కొనసాగుతోంది.

4 నెలలుగా చైనాకు ఎగుమతులు ఆగి పోవడంతో పాటు... సగానికి పైగా ఉత్పత్తులు క్వారీలోనే నిలిచిపోయాయి. వ్యాపారం సాగక.. కరీంనగర్ గ్రానైట్ వ్యాపారులు ఆందోళన చెందుతుంటే... పని దొరక్క కార్మికులు అవస్థలు పడుతున్నారు.

ఇదీ చదవండి: వేరే ఉపాధి చూసుకుంటున్న భవన నిర్మాణ కార్మికులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.