ETV Bharat / business

కరోనా ఎఫెక్ట్​:కార్యాలయాలకు రావడం తగ్గించండి ఈపీఎఫ్​ఓ - కొవిడ్​-19

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్​ఓ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్​ఓ వినియోగదారులు తమ కార్యాలయాలకు రావడం తగ్గించాలని సూచించింది. ఏమైనా అవసరం ఉంటే ఇంటివద్ద నుంచే ఆన్​లైన్​లో చేసుకోవాలని సూచించింది.

Coronavirus: EPFO advises beneficiaries to not to visit its offices
కరోనా ఎఫెక్ట్​:కార్యాలయాలకు రావడం తగ్గించండి ఈపీఎఫ్​ఓ
author img

By

Published : Mar 20, 2020, 8:44 PM IST

దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వినియోగదారులకు కీలక సూచనలు చేస్తున్నాయి. కరోనా కారణంగా పింఛనర్లు, ఉద్యోగులు తమ కార్యాలయాలకు రావడం తగ్గించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్​ఓ) విజ్ఞప్తి చేసింది. పీఎఫ్​ క్లెయిమ్, బ్యాలెన్స్ చెక్​, ఇతర చెల్లింపులను ఇంటివద్ద నుంచే ఆన్​లైన్​లో చేసుకోవాలని సూచించింది.

ఈపీఎఫ్​ఓ సేవలకు సంబంధించి దాదాపు అన్ని సేవలు ఆన్​లైన్​లో అందుబాటులో ఉన్న విషయాన్ని తెలిపింది. కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది ఈపీఎఫ్​ఓ.

ఇదీ చూడండి: కరోనా దెబ్బతో భారీగా పెరిగిన ఇంటర్నెట్ వినియోగదారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.