ETV Bharat / business

వాణిజ్యరంగంపై కరోనా ప్రభావం... మరింత పెరిగే అవకాశం - తెలంగాణ ఖజానా

తెలంగాణ ఖజానాకు ఆర్థిక ఏడాది ఆరంభంలోనే కరోనా కాటు పడింది. అమ్మకాలు భారీ స్థాయిలో పడిపోవడంతో ఆ ప్రభావం రాబడులపై మొదలైంది. రిజిస్ట్రేషన్ల రాబడులపై మాత్రం ఇంకా కారోనా ప్రభావం కనిపించలేదు.

corona-effect-on-commercial-sector
వాణిజ్యరంగంపై కరోనా ప్రభావం... మరింత పెరిగే అవకాశం
author img

By

Published : Apr 23, 2021, 9:09 AM IST

గతేడాది మాదిరిగానే ఈ ఏప్రిల్ నెలలో కూడా రాష్ట్ర ఖజానాపై కరోనా సెకండ్​ వేవ్ ప్రభావం పడుతోంది. ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే రాష్ట్ర రాబడులపై కరోనా పంజా విసిరింది. పదిరోజులుగా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతుండడం, రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుండడంతో ఆ ప్రభావం వివిధ రంగాలపై పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం తెచ్చే వాణిజ్య పన్నుల శాఖ రాబడులపై కరోనా ప్రభావం మొదలైంది. దీంతో వ్యాట్, జీఎస్టీ రాబడులు తగ్గినట్లు పేర్కొంటున్న అధికారులు... దీని ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

విక్రయాలు పడిపోయాయి..

రాష్ట్ర రాబడులపై భారీ అంచనాలతో ఉన్న ఆర్థిక, వాణిజ్య వర్గాలు మొదటి నెల రాబడుల ప్రభావంపై సమీక్ష చేస్తున్నాయి. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రాష్ట్ర ఖజానాకు గత ఆర్థిక ఏడాది రూ.52,436.21 కోట్లు రాగా... ఈ ఏడాది రాబడిని ప్రభుత్వం భారీగా అంచనా వేసింది. తాజాగా కరోనా తీవ్ర స్థాయిలో ఉండడంతో అమ్మకాలు, రవాణా, నిర్మాణ రంగంతో సహా పలు రంగాలపై ఆ ప్రభావం పడింది. గత పది రోజులుగా అమ్మకాలు గణనీయంగా తగ్గుతున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా పెద్ద మొత్తంలో రాబడులు వచ్చే కీలకమైన వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయాలు పడిపోయాయని గుర్తించారు. పర్యాటక, వినోదం విభాగాలు మూతపడటంతో పన్ను రాబడి ఘనణీయంగా తగ్గుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వైద్యం, ఆహారపదార్ధాల కొనుగోలు తప్పా... ఇతరత్రా కొనేందుకు ప్రజలు సిద్ధంగా లేరని తెలిపారు.

పరిస్థితి పూర్తిగా మారిపోయింది..

గతేడాది ఏప్రిల్ నెలలో కరోనా ప్రభావంతో రూ. 932.54 కోట్లు మాత్రమే వచ్చింది. మే నెలలో రూ. 1,567.22 కోట్లు రాగా... లాక్​డౌన్ ఎత్తివేయడంతో రాబడులు క్రమంగా పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మొదటి పది రోజులు మినహా ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు అధికారులు తెలిపారు. అన్ని రంగాలపై ఈ ప్రభావం పడటమే కాకుండా... క్రమంగా పెరుగుతోందని అంచనా వేశారు. ఇలానే కొనసాగితే వచ్చే నెలలో ఈ ప్రభావం మరింత ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

అంతగా ప్రభావం చూపలేదు..

ఇప్పటి వరకు రాష్ట్రంలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై మాత్రం కరోనా ప్రభావం అంతగా పడలేదు. ఏప్రిల్ ప్రారంభం నుంచి కూడా క్రయ, విక్రయాలు జోరుగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో నిన్నటి వరకు రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.392.42 కోట్ల రాబడి వచ్చింది. గురువారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 71,948 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్లు సాధారణంగా ఉన్నాయని, స్లాట్ బుకింగ్​లు కూడా బాగున్నాయని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: యువతపై కరోనా పంజా.. రెండో దశలో 43 శాతం కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.