ETV Bharat / business

పర్సనల్‌ లోన్‌ కావాలా? ఇవి తెలుసుకోండి...

author img

By

Published : Feb 14, 2021, 10:32 AM IST

ఇటీవల కాలంలో పర్సనల్ లోన్ తీసుకోవటం చాలా సులభం అయిపోయింది. త్వరగా రుణం మొత్తం ఖాతాలో జమౌతుండటం, తక్కువ డాక్యుమెంటేషన్, రుణాన్ని ఎలాగైనా ఉపయోగించుకునేందుకు వెసులుబాటు ఉండటం వల్ల అత్యవసర సమయాల్లో ఈ రుణం తీసుకుంటుంటారు. తనాఖా ఉండదు కాబట్టి బ్యాంకులు.. రుణాన్ని ముంజూరు చేసేటప్పుడు జాగ్రత్త వహిస్తాయి. మరి ఏఏ విషయాల ఆధారంగా వ్యక్తిగత రుణం ముంజూరు అవుతుంది. మీకు రుణం కావాలంటే ఏ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలో చూద్దాం.

Consider these things before going to avail Personal Loan
పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్నారా? అయితే..

అత్యవసర ఆర్థిక అవసరాలు, అనుకోకుండా వచ్చే ఖర్చులను అధిగమించేందుకు పర్సనల్​ లోన్​ తీసుకుంటుంటాం. అయితే.. ఇలా వ్యక్తిగత రుణం పొందే ముందు బ్యాంకుల సూచనలు, ఆఫర్లను క్షుణ్నంగా అర్థం చేసుకోవాలి. ఏ మాత్రం పొరపాటు జరిగినా చిక్కుల్లో పడాల్సి వస్తుంది. మరి ఆ జాగ్రత్తలు ఏమిటనేది ఓ సారి పరిశీలిస్తే..

క్రెడిట్‌ స్కోర్‌ చెక్‌ చేసుకోండి

ఏ బ్యాంకుకైనా వ్యక్తిగత రుణం కోసం వెళ్లగానే వారు మొట్టమొదట చేసేది మన క్రెడిట్‌ స్కోర్‌ని చూడటం. కొన్ని బ్యాంకుల్లో వారి సొంత విధానాలను వినియోగించి వ్యక్తి రుణ అర్హతను ధ్రువీకరించుకుంటారు. అందుకే క్రెడిట్‌ స్కోర్‌ తగ్గకుండా చూసుకోవాలి. 750 కంటే అధిక స్కోర్‌ ఉన్నవారికి రుణం మంజూరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన ఆర్థిక కార్యకలాపాలను బట్టి ఇది మారుతూ ఉంటుంది. సకాలంలో వాయిదాలు చెల్లించడం, క్రెడిట్‌ కార్డు బిల్లు గడువులోగా చెల్లించడం వంటి చర్యల వల్ల మంచి స్కోర్‌ మెయింటైన్‌ చేయవచ్చు. క్రెడిట్‌ స్కోర్‌ను తరచూ చెక్‌ చేసుకోవాలి. తద్వారా ఒకవేళ ఎక్కడైనా తప్పులు దొర్లినా సవరించుకునే వీలుంటుంది.

తిరిగి చెల్లించే సామర్థ్యానికి అనుగుణంగా గడువు ఎంపిక

ఖాతాదారులు రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బ్యాంకులు లేదా ఫినాన్స్ సంస్థలు.. ఖాతాదారులకు ఉన్న రుణాల ఆధారంగా అంచనా వేస్తాయి. ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉన్న వారు రుణాన్ని ఎగవేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రుణ వాయిదాల కోసం చెల్లించే మొత్తం ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. తద్వారా రుణం పొందటం సులభమవుతుంది.

అవసరమైతేనే.. అవసరం ఉన్నంతే..

ఇతర రుణాలతో పోలిస్తే వ్యక్తిగత రుణాలు పొందడం కాస్త తేలిక. మీ క్రెడిట్‌ స్కోర్‌ బాగుంటే ఎక్కువ మొత్తంలో ఇవ్వడానికి బ్యాంకులు ఆసక్తి చూపుతాయి. కొన్ని ఆఫర్లను ఇవ్వడానికి కూడా ముందుకు వస్తాయి. అలాంటి సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకు ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. మీరు తిరిగి చెల్లించే స్తోమత, భవిష్యత్ ఖర్చులు, మీ బాధ్యతలు, ఇతర రుణాలు వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఎంత తీసుకోవాలో నిర్ణయించుకోండి. మీ తక్షణ అవసరానికి ఎంత కావాలో అంతే తీసుకోవడం ఉత్తమం. వీలైతే ఆన్‌లైన్‌లో అనేక ఈఎంఐ కాలిక్యులేటర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించుకోవచ్చు. మీ నెలవారీ ఆదాయంలో ఈఎంఐల వాటా 40%-50% మించకుండా చూసుకోవడం ఉత్తమం.

మార్కెట్‌ అధ్యయనం

మీ ఆర్థిక పరిస్థితి, క్రెడిట్‌ స్కోర్‌ బాగుంటే చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణం ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. ఆయా సంస్థలు ఇస్తున్న ఆఫర్లు ఏంటో కనుక్కోండి. అవి ఎంత వరకు లాభదాయకమో చూడండి. అవసరమైతే ఆర్థిక నిపుణుల్ని సంప్రదించండి. వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు కనుక్కొని పోల్చి చూడండి. ప్రాసెసింగ్‌ ఫీజు వంటి ఇతరత్రా ఖర్చులను ఆరా తీయండి. వీటన్నింటినీ బేరీజు వేసుకుని తక్కువ ఖర్చుతో ఇచ్చే నమ్మకమైన సంస్థ వద్ద రుణం తీసుకోండి. తక్కువ వడ్డీరేటు కోసం వారితో బేరాలాడే అవకాశం ఉంటుందని మరవొద్దు.

వేర్వేరు రుణాలతో సరిపోలిక

పర్సనల్ లోన్ పై వడ్డీ రేట్లు 24 శాతం వరకు ఉంటాయి. ఇతర రుణాలతో పోల్చితే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నందున.. వివిధ బ్యాంకులు, ఫినాన్స్ సంస్థలు ఇచ్చే రుణాల రేట్లను పోల్చి చూసుకున్న అనంతరమే రుణం తీసుకునే సంస్థపై నిర్ణయానికి రావాలి. మొదట సేవింగ్స్ ఖాతా ఉన్న బ్యాంకుతో సంప్రదింపులు మొదలు పెట్టి.. తర్వాత మిగతా బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలను సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో పలు సైట్లలో కూడా వడ్డీ రేట్లను పోల్చుకునే అవకాశం ఉంది. ఇలా రుణాలను పోల్చుకునే సమయంలో వడ్డీ రేట్లతో పాటు ప్రాసెసింగ్ ఫీజు, రుణం మొత్తం తదితర ఛార్జీలను కూడా పోల్చి చూసుకోవచ్చు.

ఒకేసారి ఎక్కువ సంస్థల్లో దరఖాస్తు చేయొద్దు

ఏకకాలంలో రుణం కోసమై అనేక సంస్థల్ని ఆశ్రయించి దరఖాస్తులు ఇవ్వొద్దు. సంస్థను బట్టి నిబంధనలు మారుతుంటాయి. వారి నియమాల ప్రకారం మీరు అర్హులు కాకపోవచ్చు. అలా సంస్థలు తిరస్కరిస్తున్న కొద్దీ క్రెడిట్‌ స్కోర్‌ పడిపోతూ ఉంటుంది. నమ్మకమైన, మార్కెట్లో పేరున్న సంస్థల్నే ఆశ్రయించాలి. ఈ క్రమంలో కమీషన్‌ కోసం పనిచేసే మధ్యవర్తులను సంప్రదించొద్దు. ప్రముఖ బ్యాంకులు, ఆర్థిక సంస్థలేవీ బ్రోకర్లపై ఆధారపడవు. రుణాల మంజూరుకు వారికి సొంత వ్యవస్థ, ఉద్యోగులు ఉంటారు. నేరుగా బ్యాంకులను సంప్రదిస్తేనే మేలు.

ఒప్పంద పత్రాన్ని క్షుణ్నంగా చదవండి

సొమ్ము మీ చేతికి అందే ముందు రుణ ఒప్పందంపై మీరు సంతకం చేయాల్సి ఉంటుంది. అందులోని నియమ నిబంధనల్ని క్షుణ్నంగా చదవండి. వడ్డీరేటు, కాలపరిమితి వంటి వాటిని ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోండి. ఆలస్యమైతే చెల్లించాల్సిన అదనపు రుసుము వంటి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో నిబంధనల్ని ఉల్లంఘించినట్లయితే ఉండే పర్యవసానాల్ని అడిగి తెలుసుకోండి. అవన్నీ మీకు సమ్మతమైతేనే సంతకం చేయండి.

ఉద్యోగాలు తరచూ మారకండి

మంచి జీతం వస్తుందన్న ఆశలతో ఉద్యోగాలు తరచూ మారుతుంటారు. దీని వల్ల రుణదాతలు ఉద్యోగ అస్థిరత్వం ఉందని భావించే అవకాశం ఉంది. ఉద్యోగాలు తరచూ మారకపోవటం ఉత్తమం.

ఇదీ చదవండి: గృహ రుణం విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.