ETV Bharat / business

వినియోదారులకు షాక్​- భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

గ్యాస్ ధర మరోసారి పెరిగింది. కమర్షియల్​ ఎల్​పీజీ సిలిండర్ ధర రూ.43 పెంచుతున్నట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు తెలిపాయి. దీంతో 19కేజీల వాణిజ్య సిలిండర్ ధర దిల్లీలో రూ.1,736కి చేరింది.

Cooking gas price
వంట గ్యాస్ ధరలు
author img

By

Published : Oct 1, 2021, 12:47 PM IST

Updated : Oct 1, 2021, 5:45 PM IST

కమర్షియల్​ ఎల్​పీజీ సిలిండర్ ధర రూ.43.50 పెరిగింది. ఈ ధరలు శుక్రవారం నుంచే(అక్టోబర్​ 1) అమల్లోకి వస్తాయని చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. దీంతో 19కేజీల వాణిజ్య సిలిండర్ ధర దిల్లీలో రూ.1,736కి చేరింది. సెప్టెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు కమర్షియల్ సిలిండర్ ధర రూ.75 పెరగడం గమనార్హం.

అయితే ఇంట్లో వినియోగించే సాధారణ వంటగ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదని చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి.

ఏటీఎఫ్​ ధర భారీ పెంపు..

విమానాల్లో వాడే ఇంధన (ఏటీఎఫ్​) ధరలను కూడా భారీగా పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలకు అనుగుణంగా ఏటీఎఫ్​ ధరలను కిలో లీటర్​కు 5.79 శాతం (రూ.3,972.94) పెంచినట్లు తెలిపాయి.

తాజా పెంపుతో కిలో లీటర్​ ఏటీఎఫ్​ ధర (దిల్లీలో) రూ.72,582.16కు చేరింది. రాష్ట్రాలు విధించే పన్నుల ఆధారంగా ఈ ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.

ఇవీ చదవండి:

Last Updated : Oct 1, 2021, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.