ప్రెవేటు రంగ బ్యాంకు షేర్ల క్షీణతతో.. స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలతోనే ముగిశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, ఇండస్ఇండ్, కోటక్ మహీంద్రా, యస్ బ్యాంక్‌లు నష్టాలను నమోదు చేశాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ-సెన్సెక్స్ 192 పాయింట్లు కోల్పోయింది. చివరకు 39 వేల 395 వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ-నిఫ్టీ 53 పాయింట్లు క్షీణించింది. 11 వేల 800 దిగువకు చేరి.. 11 వేల 789 వద్ద సెషన్‌ను ముగించింది.
మొత్తం 1147 షేర్లు పుంజుకున్నాయి. 1354 షేర్లు పతనమయ్యాయి. 158 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.
ఫార్మా, ఇన్ఫ్రా, ఐటీ, పీఎస్‌యూలకు కొనుగోళ్ల మద్దతు లభించగా.. లోహరంగం ఒత్తిడికి గురైంది. మిడ్, స్మాల్ క్యాప్ షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
ఇంట్రాడే సాగిందిలా...
ఆరంభట్రేడింగ్లో 39 వేల 630 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్.. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో ఒడుదొడుకులకు లోనైంది. ఒకానొక దశలో 150 పాయింట్లకు పైగా పతనమైంది. అనంతరం.. ఏ దశలోనూ లాభాల దిశగా పయనించలేదు. 39 వేల 675 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరకు 192 పాయింట్ల నష్టంతో 39 వేల 395 వద్ద ముగిసింది.
నిఫ్టీ.. 11, 775-11, 871 మధ్య కదలాడింది. చివరకు 53 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది.
లాభనష్టాల్లోనివివే...
యాక్సిక్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, మారుతీ సుజుకీ, గెయిల్ ఉత్తమ లాభాలతో ముగించాయి. యస్ బ్యాంక్, కోల్ ఇండియా, భారతీ ఇన్ఫ్రాటెల్లు డీలా పడ్డాయి.
నిఫ్టీలో రంగాల వారీగా చూస్తే.. ప్రభుత్వరంగ బ్యాంకులు రాణించాయి. 0.67 శాతం వృద్ధి సాధించాయి. లోహరంగం.. ఎక్కువ నష్టాలను చవిచూసింది. 1.13 శాతం కోల్పోయింది.