ట్వీట్, చిత్రం, వీడియో మీమ్స్.. రూపమేదైనా కావచ్చు... సోషల్ మీడియాలో మనకు తరుచూ ఇవి కనిపిస్తుంటాయి. వాటిని చూసినప్పుడు కాసేపు నవ్వుకొని వదిలేస్తాం. వాటిని పెద్దగా పని, పాట లేని వాళ్లు తయారు చేశారని అనుకుంటాం. అయితే అది ఒకప్పుడు. ఇప్పుడు ట్రెండ్ మారింది! సరదాగా చేసే మీమ్స్‌ను నాన్ ఫంజిబుల్ టోకెన్స్(ఎన్ఎఫ్టీ) రూపంలో విక్రయిస్తూ.. లక్షల్లో సంపాదిస్తున్నారు మీమర్స్.
సరదాగా తీసిన ఫొటోలను గానీ, వీడియోలకు గానీ కాస్త సృజనాత్మకతను జోడించి.. ఎన్ఎఫ్టీ రూపంలో రూ.లక్షల నుంచి కోట్లలో గడిస్తున్నారు. భారత్‌లో తక్కువే గానీ అమెరికాలో మాత్రం.. ఈ ట్రెండ్ బాగా నడుస్తోంది.
ఇటీవల ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ తొలి ట్వీట్‌ను ఎన్ఎఫ్టీ రూపంలో విక్రయించగా.. రూ.21కోట్లు పలికింది. అలాగే హ్యూమనాయిడ్ రోబో సోఫియా గీసిన చిత్రాలకు అదే ఎన్ఎఫ్టీలో భారీ ఆదరణ లభించింది.
ఇలానే మీమ్స్ కూడా భారీ ధరకు అమ్ముడుపోతున్నాయి. అలా ఇటీవల ఎన్ఎఫ్టీల రూపంలో విక్రయించి.. వేల డాలర్ల నుంచి లక్షల డాలర్లు పలికిన మీమ్స్ వివరాలు మీకోసం..
బ్యాడ్ లక్ బ్రియాన్
- " class="align-text-top noRightClick twitterSection" data="">
దురదృష్టకర సందర్భాలను సూచించే ఈ మీమ్ మార్చిలో ఇథీరియం క్రిప్టోకరెన్సీ రూపంలో దాదాపు 36 వేల డాలర్లకు అమ్ముడుపోయింది.
డిజాస్టర్ గర్ల్
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇందులోని అమ్మాయి పేరు జోస్ రోత్. డిజాస్టర్ గర్ల్‌గా పేరొందిన ఈ మీమ్ 5 లక్షల డాలర్లకు అమ్ముడైంది.
డాగ్
- " class="align-text-top noRightClick twitterSection" data="">
క్రిప్టోకరెన్సీల్లో డాగ్ కాయిన్ చాలా ఆదరణ పొందింది. దానిని సూచించే కుక్క బొమ్మ.. కొద్ది రోజుల క్రితం ఇథీరియం క్రిప్టోకరెన్సీ రూపంలో దాదాపు 40 లక్షల డాలర్లకు అమ్ముడుపోయింది.
నిజానికి ఇది కబోసు అనే శునకం ఫొటో. దీనిని 2010లో తీశారు. అప్పటి నుంచి ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతోంది.
చార్లీ బిట్ మై ఫింగర్
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇది 2007 నాటి వైరల్ వీడియో. గతంలో ఎక్కువగా వీక్షించిన యూట్యూబ్ వీడియోగా ప్రసిద్ధి చెందింది. మే నెలలో ఎన్ఎఫ్టీ వేలంలో 7,60,999 డాలర్లకు అమ్ముడైంది.
ఓవర్లీ అటాచ్డ్ గర్లఫ్రెండ్
-
By owning the Overly Attached Girlfriend #NFT, you’re guaranteed to never be alone again.
— Laina (@laina622) April 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Ever. ❤️https://t.co/zJQ5keWmlh pic.twitter.com/aZD6P00CJh
">By owning the Overly Attached Girlfriend #NFT, you’re guaranteed to never be alone again.
— Laina (@laina622) April 2, 2021
Ever. ❤️https://t.co/zJQ5keWmlh pic.twitter.com/aZD6P00CJhBy owning the Overly Attached Girlfriend #NFT, you’re guaranteed to never be alone again.
— Laina (@laina622) April 2, 2021
Ever. ❤️https://t.co/zJQ5keWmlh pic.twitter.com/aZD6P00CJh
చూపుల్లో ప్రియుడికోసం చనిపోయే అంత ప్రేమను కుమ్మరించే ఈ అమ్మాయి ఫొటో ఇథీరియం క్రిప్టోకరెన్సీ రూపంలో 4,11,000 డాలర్లకు అమ్ముడుపోయింది.
సక్సెస్ కిడ్
- " class="align-text-top noRightClick twitterSection" data="">
విజయాన్ని సూచించే ఈ ఫొటోను 2007లో తీశారు. అప్పటి నుంచి ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని అనేక వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగించారు. ఇమ్మిగ్రేషన్ సంస్కరణను ప్రోత్సహించడానికి వైట్ హౌస్ కూడా దీన్ని ఉపయోగించుకుంది. ఇథీరియం క్రిప్టోకరెన్సీ రూపంలో దాదాపు 32,355 డాలర్లకు అమ్ముడుపోయింది.
న్యాన్ క్యాట్
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇంద్రధనస్సుతో పాటు ఎగిరే టార్ట్ పిల్లి ఫొటో ఎన్ఎఫ్టీగా 590,000 డాలర్ల ధర పలికింది.
ఇదీ చూడండి: రోబో గీసిన చిత్రం- వేలంలో కాసుల వర్షం