ETV Bharat / business

Mehul Choksi: ఛోక్సీది అరెస్ట్​ కాదు కిడ్నాప్​! - ఛోక్సీది కిడ్నాప్​ అని లాయర్ల ఆరోపణ

డొమినికా పోలీసుల అదుపులో ఉన్న మెహుల్‌ ఛోక్సీని(Mehul Choksi) కలిసేందుకు తమకు అనుమతినివ్వలేదని ఆయన తరఫు లీగల్​ టీం వెల్లడించింది. కొంతమంది వ్యక్తులు ఛోక్సీని(Mehul Choksi) కిడ్నాప్‌ చేసి డొమినికా తీసుకెళ్లినట్లు ఆరోపించింది. అక్కడి పోలీసులు ఛోక్సీని తీవ్రంగా కొట్టినట్లు అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేసింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం ప్రధాన నిందితుల్లో ఛోక్సీ కూడా ఒకరు.

Suspicions over Choksi's arrest
ఛోక్సీ అరెస్టుపై అనుమానాలు
author img

By

Published : May 28, 2021, 1:52 PM IST

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం (PNB Scam) నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ(Mehul Choksi) అదృశ్యం.. అరెస్టు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. గత ఆదివారం ఆంటిగ్వాలో కన్పించకుండా పోయిన ఆయన రెండు రోజుల తర్వాత పక్కనే ఉన్న డొమినికా దీవిలో పోలీసులకు చిక్కారు. అయితే కొంతమంది వ్యక్తులు తనను కిడ్నాప్‌ చేసి డొమినికా తీసుకెళ్లారని ఛోక్సీ(Mehul Choksi) చెప్పినట్లు ఆయన తరఫున న్యాయవాది ఆరోపించారు. ఈ మేరకు డొమినికా కోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఛోక్సీని భారత్‌కు అప్పగించడంపై అక్కడి న్యాయస్థానం స్టే విధించింది.

ఛోక్సీని కలిసేందుకు అనుమతినివ్వలేదు..

డొమినికా పోలీసుల అదుపులో ఉన్న ఛోక్సీని(Mehul Choksi) ఆయన న్యాయవాదుల బృందం కలిసేందుకు అనుమతినివ్వలేదు. అయితే చాలా సార్లు ప్రయత్నించిన తర్వాత వీడియో కాల్‌లో మాట్లాడేందుకు అంగీకరించినట్లు డొమినికాలోని ఆయన లాయర్‌ వేన్‌ మార్ష్‌ తెలిపారు. 'ఛోక్సీని కలిసేందుకు అనుమతి ఇవ్వలేదు. ఆయనను తీవ్రంగా కొట్టినట్లు అన్పిస్తోంది. కళ్లు ఉబ్బిపోయాయి. ఒంటిపై కాలిన గాయాలు ఉన్నాయి. ఆంటిగ్వాలోని జాలీ హార్బర్‌ వద్ద నుంచి కొంతమంది వ్యక్తులు తనను బలవంతంగా లాక్కొని ఓ బోటులో డొమినికా తీసుకొచ్చారని ఆయన నాతో చెప్పారు. వారు భారత్‌, ఆంటిగ్వా పోలీసులు అయి ఉంటారని ఆయన అన్నారు' అని మార్ష్‌ చెప్పుకొచ్చారు.

ఆంటిగ్వాలో ఛోక్సీ ఉన్నట్టుండి అదృశ్యమవడం, డొమినికా పోలీసులు అరెస్టు చేయడం అనుమానాస్పదంగా ఉందని ఆయన లీగల్‌ టీం ఆరోపించింది. భారత్‌కు రప్పించేందుకు కావాలనే ఆయనను డొమినికా తీసుకెళ్లి ఉంటారని లాయర్లు అన్నారు. అయితే ఆయనకు భారత్‌ పౌరసత్వం లేదని, అలాంటప్పుడు ఆ దేశానికి ఎలా అప్పగిస్తారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు అప్పగింతపై స్టే విధించింది. తదుపరి విచారణను డొమినికా కాలమానం ప్రకారం.. శుక్రవారం ఉదయం విచారించనున్నట్లు తెలుస్తోంది.

ఇంకా భారతీయుడేనా..

అయితే భారత్‌లో పౌరసత్వాన్ని రద్దు చేసుకునేందుకు ఛోక్సీ చేస్తున్న ప్రయత్నాలు ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. ఆయన ఇంకా భారతీయుడేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఛోక్సీ అప్పగింతపై తాము న్యాయపరంగా ముందుకు వెళ్తామని పేర్కొంటున్నాయి.

గత ఆదివారం సాయంత్రం ఛోక్సీ ఆంటిగ్వాలో అదృశ్యమైన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై ఇంటర్‌పోల్‌ ఎల్లో నోటీసులు జారీ చేసింది. అయితే రెండు రోజుల తర్వాత ఆంటిగ్వా పక్కనే ఉన్న డొమినికాలో ఓ బీచ్‌లో పత్రాలు విసిరేస్తూ కన్పించిన ఛోక్సీని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించడం వల్ల అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఛోక్సీని తిరిగి తమ దేశానికి పంపొద్దని, అటు నుంచే అటే భారత్‌కు అప్పగించమని ఆంటిగ్వా ప్రధాని కోరారు. పీఎన్‌బీ కేసులో ఛోక్సీలో రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ అవడం కారణంగా ఆయనను డొమినికా ప్రభుత్వం భారత్‌కు అప్పగించే వీలున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:Mehul Choksi: 'ఛోక్సీని భారత్​కు అప్పగించండి!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.