ETV Bharat / business

మరో 25 యాప్​లపై ప్రభుత్వం కొరడా

క్యాబ్ సేవలు అందించే సంస్థ దీదీ గ్లోబల్ ఐఎన్‌సీపై చైనా చర్యలు ప్రారంభించింది. దీదీ గ్లోబల్ ఐఎన్‌సీకి చెందిన 25 యాప్‌లను తొలగించాలని యాప్​ స్టోర్లను ఆదేశించింది. వ్యక్తిగత సమాచారాన్ని దీదీ గ్లోబల్ ఐఎన్‌సీ అక్రమంగా , నిబంధనలకు విరుద్ధంగా సేకరిస్తోందనే ఆరోపణలపై చైనా ఈ చర్యలు తీసుకుంది.

author img

By

Published : Jul 10, 2021, 3:11 PM IST

CHINA-DIDI-APPS
మరో 25 యాప్​లపై చైనా కొరడా

దేశ భద్రత, సైబర్‌ సెక్యూరిటీ పేరిట బడా సాంకేతిక సంస్థలపై విరుచుకుపడుతున్న చైనా.. తాజాగా మరో 25 యాప్‌లను తొలగించాలని యాప్‌ స్టోర్లను ఆదేశించింది. అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రముఖ క్యాబ్‌ సేవల కంపెనీ 'దీదీ గ్లోబల్‌' యాప్‌ను తొలగించింది. తాజాగా అదే 'దీదీ'కి చెందిన మరో 25 అనుబంధ యాప్‌లను కూడా తొలగించాలని సైబర్‌స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆదేశించింది. ఇతర దేశాల స్టాక్‌ మార్కెట్లలో నమోదైన కంపెనీలపై నిఘా కొనసాగుతుందని గత వారం చైనా పేర్కొంది. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు పేరిట చైనీయులకు చెందిన కీలక సమాచారాన్ని విదేశాలకు తరలిస్తున్నారన్నది చైనా ప్రభుత్వ ఆరోపణ.

కొత్త సైబర్‌ నిబంధనల పేరిట.. ఇతర దేశాలకు తరలించే సమాచారంపై ప్రభుత్వ నియంత్రణ మరింత కఠినతరం చేసేందుకు చైనా సిద్ధమైంది. గతంలో దేశ భద్రత పేరిట టెన్సెంట్‌‌, అలీబాబా కంపెనీలపై విరుచుపడ్డ డ్రాగన్‌ ఇప్పుడు సైబర్‌భద్రత నెపంతో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.

గత ఏడాది టిక్‌టాక్‌ సహా పలు చైనా యాప్‌లు దేశ భద్రతకు సవాల్‌ విసిరిన నేపథ్యంలో వాటిపై నిషేధం విధిస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి భిన్నంగా ఇప్పుడు సొంత దేశ యాప్‌లనే నిషేధిస్తున్న చైనా.. తన ఆధిపత్య ధోరణిని బయట పెట్టుకుంటోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: 'దీదీ'కి ఒక్కరోజులో రూ.1.64లక్షల కోట్లు నష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.