భారత్ నుంచి దిగుమతి చేసుకునే సింగిల్ మోడ్ ఆప్టికల్ ఫైబర్‌పై యాంటీ- డంపింగ్ సుంకాలను మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తూ చైనా నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని చైనా వాణిజ్య శాఖ (ఎమ్ఓసీఓఎమ్) స్పష్టం చేసింది. టారీఫ్‌లు 7.4 శాతం నుంచి 30.6 శాతం మధ్యలో ఉంటాయని వెల్లడించింది.
యాంటీ- డంపింగ్ సుంకాలను పొడిగించకపోతే తాము భారీగా నష్టపోతామని స్వదేశీ సింగిల్ మోడ్ ఆప్టికల్ ఫైబర్ పరిశ్రమలు ప్రభుత్వానికి తెలిపాయి. వీటిని పరిగణించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది ఎమ్ఓసీఓఎమ్.
భారత్ నుంచి దిగుమతి చేసుకునే సింగిల్ మోడ్ ఆప్టికల్ ఫైబర్‌పై ఐదేళ్ల పాటు సుంకాలు విధిస్తూ 2014 ఆగస్టు 13న చైనా నిర్ణయం తీసుకుంది.