ETV Bharat / business

ఆర్థిక ప్రణాళికకు పాటించాల్సిన నాలుగు లక్షణాలు - మనీ మేనేజ్ మెంట్:

డబ్బెవరికి చేదు. సమస్త ప్రపంచం డబ్బుపైనే నడుస్తుంది. డ‌బ్బు సంపాదించాలన్నా, ఉన్న దాన్ని కాపాడుకోవాలన్నా కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. తద్వారా ఆయురారోగ్యాలతో పాటు ఆర్థికారోగ్యాన్నీ కాపాడుకోవచ్చు.

Certain methods are required to earn a dub and save it
సరైన ఆర్థిక ప్రణాళికకు ఐదు మార్గాలు
author img

By

Published : Jan 14, 2020, 8:01 AM IST

ధనవంతులు కావాలని ఎవరికి ఉండదు? ఎందుకంటే డబ్బుతో సుఖాలు, సౌకర్యాలు, అధికారం, మంది మార్బలం అన్ని చేకూర్చుకోవచ్చు. కొత్త పదవి పొందాలన్నా, ఉన్న పదవిలో కొనసాగాలన్నా, అలాగే పైపదవికి వెళ్లాలన్నా డబ్బు ఎంతో ప్రాముఖ్యం వహిస్తుంది. డబ్బు మనో ధైర్యం, స్థైర్యం పెంచుతుంది.

చాలా మంది ఉద్యోగం చేసి సంపాదించి లేదా వ్యాపారం చేసి, అలాగే వృత్తి పరంగా అభివృద్ధి చెంది ధనికులమవుతాం అనుకుంటారు. కొంత మందికి వంశపారంపర్యంగా ఆస్తిపాస్తులు ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ, కొత్తగా సంపాదించాలన్నా లేదా ఉన్న వాటిని కాపాడుకోవాలన్నా కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

తార్కిక ఆలోచన (లాజికల్ థింకింగ్):

ఈ మధ్యకాలంలో మనం వింటున్న మాట పాజిటివ్ థింకింగ్. అంటే అన్నిటిని మంచి ఉద్దేశ్యంతో ఆలోచించమని. ఎదుటివారు చెప్పిన మాటను కానీ, చేసిన పనిని కానీ మంచి దృష్టితో తీసుకోమని. దానికి తగినట్టుగా మన మాటకానీ, పనికానీ, మన ఆలోచన కానీ ఉండాలంటారు. అయితే, దీని వలన అన్ని సందర్భాలలోనూ మంచి జరుగుతుందని చెప్పడం కష్టం. చాలా సమయాల్లో మంచి ఉద్దేశ్యంతో తీసుకుని నష్టపోయే ప్రమాదం ఉంది.

దీనికంటే ఉత్తమమైనది ‘తార్కిక ఆలోచన’. అంటే ప్రతి మాటకు లేదా ప్రతి పనిని తార్కికంగా ఆలోచించినట్లయితే, దాని వెనకాల ఉన్న మర్మం అర్ధమవుతుంది. అది ఎదుటివారు చెప్పినదే కానక్కర్లేదు. మనం చేయబోయే పని లేదా మాట్లాడబోయే మాట వలన, జరగబోయే పరిణామాలను విడమర్చి ఆలోచించగలిగితే, రాబోయే అనర్ధాలను, ప్రమాదాలను అరికట్టవచ్చు. పూర్తిగా నివారించలేకపోవచ్చు. ఇది మన శారీరక, మానసిక, ఆర్ధిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనివలన మీ శక్తిని మీ ఉద్యోగ, వ్యాపారాల మీద దృష్టి పెట్టి, ఉన్నతమైన విజయాలను సాధించవచ్చు.

సమయ పాలన:

అందరికి ఉన్నది 24 గంటలే. కొందరు సరైన విధంగా ఉపయోగించుకుని, అభివృద్ధి చెందుతుంటే, మరి కొందరు అనవసర విషయాల గురించి ఆలోచించి, లేదా ఏమీ ఆలోచించకుండా తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఒక పని వల్ల తమకు నష్టం వాటిల్లితే అది ఇతరుల వల్ల జరిగిందని భావిస్తారు. సమయాన్ని సరిగా వినియోగించుకోవడం వల్ల అనవసరపు ఖర్చులను, వృధా ప్రయాసలను, మానసిక ఆందోళనలను తగ్గించుకోవచ్చు. దీనివలన ఉన్న సమయాన్ని ఉన్నతమైన విషయాలపై మళ్లించడం ద్వారా మానసికంగా, ఆర్ధికంగా ఎదగవచ్చు.

ఉదా : ఒక వ్యక్తి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కి ఉదయం 11 గంటలకు చేరుకోవాలి. ఇంటర్వ్యూ ప్రదేశానికి 15 నిమిషాల ముందే అక్కడ ఉండాలి. అది నియమం. ఆ ఉద్యోగం అతనికి చాలా అవసరం. అతని ఇంటి నుంచి ఇంటర్వ్యూ చేసే ప్రదేశానికి చేరుకోవటానికి 2 గంటలు పడుతుంది. అందువల్ల అతను సరైన టైం ప్లాన్ వేసుకుని, అందుకు ఇంటి నుంచి ఎంత సమయానికి బయలుదేరాలో నిర్ణయించుకోవాలి. ఎటువంటి ప్రయాణ సాధనాలు ఉన్నాయి, వాటిద్వారా ప్రయాణిస్తే ఎంత సమయం పడుతుంది, తగిన ప్రయాణ ఖర్చులకు సరిపడ నగదు, చిల్లర ఎంత తీసుకువెళ్లాలి వంటివి కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే, ఫోటోకాపీ తీసుకోవలసిన పత్రాలను ముందే ఉంచుకోవడం మంచిది.
ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అలాగే ప్రతి పనిలో సమయ పాలన ఆచరిస్తే, మీ కాలంతోపాటు డబ్బు కూడా ఆదా అవుతుంది.

మనీ మేనేజ్ మెంట్:

మనుషుల జీవనాడి- డబ్బు. ఈ రోజులలో డబ్బు లేకపోతే ఏమీ చేయలేని స్థితి. డబ్బు ఉంటే కలిగే మనోధైర్యం, ఆత్మవిశ్వాసం వేరు. ఈ డబ్బే కుటుంబ సభ్యుల మధ్య కూడా తేడా తెస్తుంది. ఒకే తల్లిదండ్రులకు కలిగిన పిల్లలలో కూడా డబ్బు వలన కలిగే తేడా కనబడుతుంది. వారి మధ్య ప్రేమ, అభిమానాలు ఉండవచ్చు. అవి డబ్బు వరకు రానంతవరకే. డబ్బు లేకపోతే ఆరోగ్యం కాపాడుకోవడం కూడా కష్టమే. కాబట్టి డబ్బు విలువ తెలుసుకొని, దాన్ని కాపాడుకోవాలి.
అంటే సంపాదన మొదలైన నాటినుంచే సరైన పథకాలలో మదుపు చేయాలి. వృధా ఖర్చులను నియంత్రించుకోవాలి. ప్రతి పధకం అనుకూలతలు, ప్రతికూలతలు క్షుణ్ణంగా గ్రహించి తగిన నిర్ణయం తీసుకోవాలి. డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు.

ఉదా: కుటుంబంలో సంపాదించే వ్యక్తికి అనుకోని సంఘటన వలన, సంపాదించే శక్తిని కోల్పోతే, లేదా మరణిస్తే, ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎండోమెంట్, హోల్ లైఫ్ లాంటి జీవిత బీమా పాలసీ తీసుకునేవారు. అయితే, మారుతున్న కాలానికి, జీవన ప్రమాణాలకు వాటి ద్వారా పొందే హామీ మొత్తం సరిపోవు. అదీగాక వీటిలో ప్రీమియం కూడా అధికంగా ఉంటుంది. అందుకే, తగినట్లుగా టర్మ్ జీవిత బీమా పాలసీలు ప్రవేశ పెట్టారు. వీటిలో తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా హామీని పొందొచ్చు.

కమ్యూనికేషన్:

మనం చెప్పదల్చుకున్న విషయాన్ని క్లుప్తంగా, సంక్షిప్తంగా స్వల్ప కాలంలో చెప్పగలగడం. సరైన సమయంలో చేసే కమ్యూనికేషన్ ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. మనకు నచ్చినా, నచ్చకపోయినా చెప్పే విధానం చక్కగా ఉండాలి. సరైన కమ్యూనికేషన్ ద్వారా శత్రుత్వాన్ని కూడా మితృత్వంగా మార్చుకోవచ్చు. సరైన సమయంలో చేసిన కమ్యూనికేషన్ వలన శారీరక, మానసిక, ఆర్థికంగా కూడా లబ్దిపొందొచ్చు. ఎంతో సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఆధునిక యుగంలో దీని విశిష్టత విపరీతంగా పెరిగింది. తగినట్టుగా సాధనాలుకూడా వినియోగంలోకి వచ్చాయి. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ వంటి వాటిని సరైన పద్దతిలో వినియోగించుకుంటే ఆరోగ్యం, ఆనందం, ఆర్థికాభివృద్ధి కలుగుతాయి.

చివరగా...

పై విషయాలను మన జీవితాలకు అన్వయించుకుంటే ఆనందం, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆర్ధిక అభివృద్ధి. సంపాదన మొదలైన నాటినుంచే, తగిన ఆర్ధిక లక్ష్యాలను నిర్దేశించుకుని, సరైన పథకాలలో మదుపు చేయడం ద్వారా ఆర్థికంగాఎదగవచ్చు.

SHOTLIST:
RESTRICTION SUMMARY: 14 DAYS NEWS USE ONLY; NO SALES
BUCKINGHAM PALACE HANDOUT - 14 DAYS NEWS USE ONLY; NO SALES
Internet - 13 January 2019
1. SCREENSHOT of statement released by Queen Elizabeth II, reading (English):
"Today my family had very constructive discussions on the future of my grandson and his family. My family and I are entirely supportive of Harry and Meghan's desire to create a new life as a young family. Although we would have preferred them to remain full-time working Members of the Royal Family, we respect and understand their wish to live a more independent life as a family while remaining a valued part of my family. Harry and Meghan have made clear that they do not want to be reliant on public funds in their new lives. It has therefore been agreed that there will be a period of transition in which the Sussexes will spend time in Canada and the UK. These are complex matters for my family to resolve, and there is some more work to be done, but I have asked for final decisions to be reached in the coming days."
UK POOL - AP CLIENTS ONLY
Archive: London, 7 January 2020
2. Wide of Duke and Duchess of Sussex, Prince Harry and Meghan, arriving at Canada House
THE DUKE AND DUCHESS OF SUSSEX VIA INSTAGRAM/@PHarry_Meghan - AP CLIENTS ONLY
Archive: Internet, 8 January 2020
3. STILL IMAGE - Screengrab of statement by Duke and Duchess of Sussex
UK POOL - AP CLIENTS ONLY
Archive: London, 7 January 2020
4. Various, Prince Harry and Meghan, Duchess of Sussex talking to staff at Canada House
UK POOL - AP CLIENTS ONLY
Archive: Sandringham, 25 December 2018
5. Wide shot Queen Elizabeth II leaving church
6. Medium shot Harry and Meghan leaving alongside Prince William and Kate, the Duke and Duchess of Cambridge
STORYLINE:
HARRY, MEGHAN ALLOWED TO MOVE PART-TIME TO CANADA
Queen Elizabeth II said Monday (13 JAN. 2020) that she has agreed to grant Prince Harry and Meghan their wish for a more independent life that will see them move part-time to Canada.
The British monarch said in a statement that “today my family had very constructive discussions on the future of my grandson and his family."
She said it had been "agreed that there will be a period of transition in which the Sussexes will spend time in Canada and the UK."
Harry and Meghan are also known as the Duke and Duchess of Sussex.
In a six-sentence statement that mentioned the word "family" six times, the queen said that “though we would have preferred them to remain full-time working Members of the Royal Family, we respect and understand their wish to live a more independent life.”
Monday's meeting involved the queen, her heir Prince Charles and his sons William and Harry, with Meghan expected to join by phone from Canada.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.