ETV Bharat / business

త్వరలో ఉద్దీపన పథకం ప్రకటించనున్న కేంద్రం

కరోనా వైరస్ ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు కేంద్రం చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఉద్దీపన పథకాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

nirmala
నిర్మలా సీతారామన్
author img

By

Published : Mar 23, 2020, 9:58 PM IST

కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడటంతో కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఆర్థిక ఉద్దీపన పథకాన్ని(బెయిలౌట్‌ ప్యాకేజ్‌) ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో ప్రత్యేక కార్యదళాన్ని ఏర్పాటు చేయనున్నామని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పరిస్థితులను ఆ బృందం సమీక్షించి సలహాలు ఇస్తుందని తెలిపారు. కరోనాను కట్టడి చేసేందుకు కంపెనీలు ప్రకటించే విరాళాలు 'కార్పొరేట్‌ సామాజిక బాధ్యత' కింద లెక్కిస్తామని ఇంతకుముందే నిర్మల ట్వీట్‌ చేశారు. సెబీ, ఆర్బీఐ నిబంధనల నుంచి రూ.లక్ష కోట్ల మేరకు ఉపశమనం కల్పిస్తామని ఆ ట్వీట్ల ద్వారా తెలుస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

వైరస్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్రిలియన్‌ డాలర్ల ఉద్దీపన పథకం ప్రకటించగా డెమోక్రటిక్‌ పార్టీ సభ్యులు దానిని అడ్డుకున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత లభించనుంది. ఇదే ప్రేరణగా భారత ప్రభుత్వమూ ఉద్దీపన పథకం ప్రకటిస్తుందని వ్యాపారవేత్తలు ఎదురుచూస్తున్నారు.

ఇదీ చదవండి: 'లాక్​డౌన్​'ను ఉల్లంఘిస్తే 6 నెలలు జైల్లో గడపాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.