ETV Bharat / business

ఎన్​95 మాస్కుల ఎగుమతిపై నిషేధం ఎత్తివేత - ఎన్​95 మాస్కుల ఎగుమతి

ఎన్​95 మాస్కుల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని కేంద్రం తొలగించింది. ఇక నుంచి ఇతర మాస్కుల మాదిరిగా వాటిని స్వేచ్ఛగా ఎగుమతి చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రపంచదేశాల కోసం భారత్ ఈ మాస్కులను తయారు చేస్తోందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.

N95 MASK NEWS
ఎన్​95 మాస్కుల ఎగుమతిపై నిషేధం ఎత్తివేత
author img

By

Published : Oct 7, 2020, 8:10 AM IST

కరోనా నేపథ్యంలో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఎన్​95 మాస్క్‌ల ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ఆయా ఆంక్షలను ఎత్తివేసింది. ఎన్​95, ఎఫ్ఎఫ్2 మాస్క్‌లను నిషేధిత జాబితా నుంచి తొలగించి, మిగితా మాస్క్‌ల మాదిరిగా స్వేచ్ఛగా ఎగుమతి చేసుకునేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు విదేశీ వాణిజ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రపంచ దేశాల కోసం భారత్‌ ఎన్​95, ఎఫ్ఎఫ్2 మాస్క్‌లను తయారు చేస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. ప్రపంచమంతటికీ ఇకనుంచి మాస్కులను స్వేచ్ఛగా ఎగుమతి చేసుకోవచ్చని ట్వీట్‌ చేశారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వస్త్ర ఎగుమతుల ప్రోత్సాహక మండలి స్వాగతించింది.

  • India is Making for the World: N95 & FFP2 Masks can now be exported freely to countries across the world.

    Make in India is spurring economic growth and employment while helping the world battle COVID-19. pic.twitter.com/I48B9mxGS9

    — Piyush Goyal (@PiyushGoyal) October 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.