ETV Bharat / business

చెన్నై ఐవీసీలో 'కొవాగ్జిన్‌' తయారీ! - చెన్నై ఐపీసీ

చెన్నై సమీపంలోని ఓ ప్రాంతంలో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ వ్యాక్సిన్‌ కాంప్లెక్స్‌(ఐవీసీ)లో కొవాగ్జిన్​ టీకాను తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు భారత్​ బయోటెక్​తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

covaxin, chennai IVC
కొవాగ్జిన్, చెన్నై ఐవీసీ
author img

By

Published : Apr 16, 2021, 7:38 AM IST

కొవిడ్‌-19 కేసులు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో, టీకాల కొరతను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌కు చెందిన 'కొవాగ్జిన్‌' టీకాను చెన్నై సమీపంలోని చెంగల్పట్టులో గల ఐవీసీ కాంప్లెక్సు (ఇంటిగ్రేటెడ్‌ వ్యాక్సిన్‌ కాంప్లెక్స్‌) లో తయారు చేయించే అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. టీకాల తయారీలో స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దాదాపు తొమ్మిదేళ్ల క్రితం ఈ కాంప్లెక్సును ఏర్పాటు చేసింది. కానీ, ఇప్పటి వరకు ఇక్కడ టీకాల తయారీ మాత్రం మొదలు కాలేదు.

కొవిడ్‌-19 కేసులు రోజుకు 2 లక్షల మేర నమోదవుతుండటం, ప్రజలందరికీ టీకా ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నందున టీకా తయారీని భారీగా పెంచడంపై అధికార వర్గాలు దృష్టి సారించాయి. ఇందుకోసం ఐవీసీ కాంప్లెక్సును సద్వినియోగం చేసుకోవాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. దీనిపై ఇప్పుడు కసరత్తు చేపట్టినట్లు సమాచారం. ఐవీసీలో ప్రస్తుతం హ్యాండ్‌ శానిటైజర్లు, డిస్‌ఇన్ఫెక్టెంట్లు తయారు చేస్తున్నారు. దీన్లో కొవిడ్‌-19 టీకా తయారీ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించగా అందుకు, భారత్‌ బయోటెక్‌ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

సరఫరాలు తగినంత లేనందునే: కొవిడ్‌ నిరోధానికి ప్రస్తుతం మనదేశంలో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు మాత్రమే ప్రజలకు వేస్తున్నారు. ఇవి కూడా దేశీయ అవసరాలకు తగినంతగా తయారు కావడం లేదు. తాజాగా రష్యాకు చెందిన 'స్పుత్నిక్‌ వి' టీకాను మనదేశంలో అత్యవసరంగా వినియోగించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ టీకా తొలి దశలో రష్యా నుంచి దిగుమతి కావాలి. ఆ టీకా అందుబాటులోకి వచ్చేందుకు 1-2 నెలలు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశీయంగా 'కొవాగ్జిన్‌' టీకా లభ్యత పెంపొందించే యత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా నెలకు 6- 7 కోట్ల డోసుల కొవిషీల్డ్‌ టీకాను సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా అందిస్తుందని భావించగా, అది కూడా సాధ్యం కావడం లేదు. అందుకే ఐవీసీ కాంప్లెక్సులో 'కొవాగ్జిన్‌' టీకా తయారీ చేపట్టడంపై దృష్టిసారించింది.

హాఫ్‌కైన్‌ బయోఫార్మాకు కేంద్రం అనుమతి

'కొవాగ్జిన్‌' టీకా తయారు చేసేందుకు ముంబయికి చెందిన హాఫ్‌కైన్‌ బయో-ఫార్మాస్యూటికల్స్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ కంపెనీకి దాదాపు 12 కోట్ల డోసుల టీకా తయారు చేసే సామర్థ్యం ఉందని, కొవాగ్జిన్‌ తయారీకి అనుమతించాలన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే చేసిన విజ్ఞప్తిని కేంద్రం అంగీకరించింది.

ఇదీ చదవండి:హిందువును ముస్లిం అనుకొని ఖననం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.