సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందే దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ మరో ముందడుగు వేసింది. ఇతర మూలాల నుంచి వార్తలను తీసుకొని ఒక క్రమంలో అమర్చి ప్రసారం చేసే ఇంటర్నెట్ వేదికలు ఇకనుంచి ఐబీ మంత్రిత్వశాఖ ఆధీనంలో ఉండనున్నాయి.
గూగుల్, ఫేస్‌బుక్ ట్విట్టర్ వంటి వేదికలను తమ పరిధిలోకి తీసుకొచ్చేలా మంత్రిత్వశాఖ తాజాగా నిబంధనలు రూపొందించింది. అయినప్పటికీ వినియోగదారులు పోస్టు చేసే సమాచారంపై నిరోధకతను తీసుకురావడానికి మధ్యవర్తిత్వ హోదాని పొందేందుకు అవకాశం ఉంది. అయితే ఈ మధ్యవర్తిత్వ హోదా ఉంటుందా? ఉండదా అనేది తాజా నిబంధనల్లో స్పష్టంగా పేర్కొనలేదు. దుష్ప్రచారాన్ని, నకిలీ వార్తలను కట్టడి చేయటానికి తమ సైట్లలో పోస్టయ్యే సమాచారంపై మరింత బాధ్యతగా మెలగాలని వివిధ సామాజిక మాధ్యమ వేదికలను మంత్రిత్వశాఖ కోరుతోంది.