ETV Bharat / business

రాష్ట్రాలకు రూ.19,950 కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల - GST

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.19,950కోట్లు జీఎస్టీ పరిహారం విడుదల చేసింది కేంద్రం. 2019 అక్టోబర్​, నవంబర్​లకు గాను ఈ పరిహారం విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Central govt releases Rs 19,950 crore GST compensation to states
రాష్ట్రాలకు రూ.19,950 కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల
author img

By

Published : Feb 20, 2020, 11:49 PM IST

Updated : Mar 2, 2020, 12:42 AM IST

జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అక్టోబర్​, నవంబర్​ నెలలకు గాను రూ.19,950 కోట్లు విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు విడుదల చేసిన పరిహారం మొత్తం రూ. 1,20,498 కోట్లకు చేరినట్లు పేర్కొంది.

జనవరి 31 లోపు రూ.78,874 కోట్లు సెస్‌ కింద వసూలు అయినట్లు కేంద్రం తెలిపింది. జీఎస్టీ అమలు తర్వాత కలిగే రెవెన్యూ లోటు భర్తీకి ఐదేళ్లపాటు రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వాలని జీఎస్టీ చట్టం చెబుతోంది. ఇందులో భాగంగా కేంద్రం తాజాగా జీఎస్టీ పరిహారం ఇచ్చింది. 2017 జులై 1న జీఎస్‌టీ అమల్లోకి వచ్చింది.

ఆర్థిక సంవత్సరాల వారీగా..

జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత 2017-18 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ సెస్​ రూపంలో రూ. 62,611 కోట్లు వసూలైంది. అందులో రాష్ట్రాలకు రూ.41,146 కోట్లు చెల్లించినట్లు కేంద్రం తెలిపింది. 2018-19లో రూ.95,081 కోట్లు వసూలు చేయగా.. రాష్ట్రాలకు రూ.69,275కోట్లు విడుదల చేసింది కేంద్రం.

ఇదీ చూడండి: భారీగా పడిపోయిన వాహనాల అమ్మకాలు

Last Updated : Mar 2, 2020, 12:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.