ETV Bharat / business

'ఇకపై ఆ హెల్మెట్​లు మాత్రమే వాడాలి' - హెల్మెట్​

బ్యూరో ఆఫ్ ఇండియన్​ స్టాండర్డ్స్​(బీఐఎస్) ) ధ్రువీకరించిన హెల్మెట్​లనే దేశంలో వాడాలని కేంద్రం ఆదేశించింది. తక్కువ నాణ్యత కలిగిన హెల్మెట్​లు ఉపయోగించకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. బీఐఎస్​ హెల్మెట్​ల వల్ల రోడ్డు ప్రమాదాల నుంచి బయటపడవచ్చని వివరించింది.

central government  issued new guidelines for two wheelers
'ఇకపై ఆ హెల్మెట్​లు మాత్రమే వాడాలి'
author img

By

Published : Nov 27, 2020, 10:21 PM IST

దేశంలో ఇకపై భారతీయ ప్రమాణాలు(బీఐఎస్​) కలిగిన హెల్మెట్​లనే తయారు చేయాలని, వాటినే వాడాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. "హెల్మెట్​ ఫర్​ రైడర్స్​ ఆఫ్ టూ వీలర్స్​ మోటార్​ వెహికిల్స్​ ఆర్డర్, 2020 " అనే పేరుతో మార్గదర్శకాలను విడుదల చేసింది.

రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఓ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. భారతీయ శీతోష్ణస్థితికి అనుకూలంగా బరువు తక్కువగా ఉన్న హెల్మెట్​లను వాడాలని కమిటీ 2018లో సూచనలు చేసింది. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఏటా దేశంలో దాదాపు 1.7కోట్ల ద్విచక్ర వాహనాలు తయారు అవుతున్నాయి.

కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని జెనీవాకు చెందిన 'ది ఇంటర్నేషనల్​ రోడ్​ ఫెడరేషన్' సంస్థ​ ప్రశంసించింది. ఇకపై భారత్​లో బీఐఎస్​ ఆమోదించని హెల్మెట్​లను విక్రయిస్తే నేరంగా పరిగణిస్తారని సంస్థ అధ్యక్షుడు కేకే కపిలా తెలిపారు.

ఇదీ చదవండి: ఒక షిఫ్టు 12 గంటలు- ఎందుకంత వ్యతిరేకత?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.