CCI probe against Apple: మొబైల్ దిగ్గజం యాపిల్ సంస్థకు కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) భారీ షాక్ ఇచ్చింది. యాప్ స్టోర్‌కు సంబంధించి నిబంధలకు విరుద్ధంగా విధానాలు అవలంబిస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో... పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని శుక్రవారం ఆదేశించింది.
Apple app store: వినియోగదారులకు యాప్స్ అందించేందుకు, డిజిటల్ చెల్లింపుల కోసం... మార్కెట్లో యాపిల్ పోటీ సంస్థలపై నియంత్రణ, ఆధిపత్యం ప్రదర్శిస్తోందని యాపిల్ సంస్థ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో దీనిపై సీసీఐకి యాపిల్ ఐఎన్‌సీ, యాపిల్ ప్రైవేట్ లిమిటెడ్ ఫిర్యాదు దాఖలు చేశాయి.
ఐఓఎస్ వినియోగదారులకు తమ యాప్‌లను పంపిణీ చేసేందుకు యాపిల్ ఐఫోన్, ఐప్యాడ్‌లో ప్రిఇన్‌స్టాల్ చేసిన యాపిల్ యాప్‌స్టోర్‌ను మాత్రమే వినియోగించాలని సీసీఐ తన 20 పేజీల ఉత్తర్వులో పేర్కొంది. యాపిల్ యాప్ స్టోర్‌లో థర్డ్ పార్టీలకు అనుమతించకూడదని చెప్పింది. ఈ తరహా చర్యలు నిబంధనలను ఉల్లంఘించిన కింద పరిగణిస్తామని పేర్కొంది.
ఇదీ చూడండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ షురూ! త్వరలోనే రెండో విడత బుకింగ్!!
ఇదీ చూడండి: 'దుస్తులపై జీఎస్టీ యథాతథం.. పాదరక్షలపై భారీగా పెంపు'