ETV Bharat / business

'వివాద్​ సే విశ్వాస్​'తో ప్రభుత్వానికి రూ.72,480 కోట్లు! - Nirmala sitharaman news

ప్రభుత్వానికి.. ప్రత్యక్ష పన్నుల వివాద పరిష్కార పథకం 'వివాద్​ సే విశ్వాస్​' ద్వారా రూ.72,480 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీలు(సీపీఎస్​యూలు) కూడా రూ. లక్ష కోట్ల పన్ను వివాదాలను పరిష్కరించుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Cash Bonanza: Govt gets over Rs 72,000 crore under Vivad se Vishwas scheme
'వివాద్​ సే విశ్వాస్​'తో ప్రభుత్వానికి రూ.72,480 కోట్లు
author img

By

Published : Nov 19, 2020, 6:31 AM IST

ప్రత్యక్ష పన్ను వివాద పరిష్కార పథకం 'వివాద్​ సే విశ్వాస్​' ద్వారా ప్రభుత్వానికి ఇప్పటివరకు రూ.72,480 కోట్లు వచ్చాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ పథకం కింద ఈ నెల 17 వరకు రూ. 31,734 కోట్ల వివాద పన్ను డిమాండ్​తో కలిపి మొత్తం 45,885 డిక్లరేషన్లు దాఖలయ్యాయి. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీలు(సీపీఎస్​యూలు) కూడా లక్ష కోట్ల రూపాయల పన్ను వివాదాలను పరిష్కరించుకుంటున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.

కరోనా మహమ్మారి నేపథ్యంలో గత నెలలో ప్రభుత్వం ఈ పథకాన్ని 2021 మార్చి 31వరకు పొడిగించింది. అయితే డిక్లరేషన్లు మాత్రం ఈ ఏడాది ఆఖరులోపు దాఖలు చేయాలని షరతు విధించింది. ఈ పథకం కింద సీపీఎస్​యూలు, పన్ను చెల్లింపుదార్లు కలిపి రూ.72,480 కోట్లు ఇప్పటివరకు చెల్లించారని సమాచారం. ఆదాయపు పన్ను విభాగం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ పథకం గురించి పన్ను చెల్లింపుదార్లకు సమాచారం అందించేందుకు ఇ-క్యాంపెయిన్​ ప్రారంభించాలని నిర్ణయించారు.

ఇదీ చూడండి: 'వివాద్ సే విశ్వాస్' బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.