బొగ్గు గనులను వేలం వేసేందుకు ఉన్న నిబంధనలను సరళీకృతం చేసేలా చట్ట సవరణకు ప్రతిపాదించిన ఆర్డినెన్స్‌ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. బొగ్గు గనులను వేలం వేసి, ఉక్కు, విద్యుత్ రంగాలకు ఉపయోగించేలా ఈ ఆర్డినెన్స్‌ను రూపొందించారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో ఖనిజ చట్టాల సవరణ ఆర్డినెన్స్-2020కి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని గనుల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి తెలిపారు.
46 ఇనుప ధాతువు గనులు సహా ఇతర గనులను 2020 మార్చి 31 తేదీ లోపు వేలం వేసేందుకు ఈ ఆర్డినెన్స్ అనుమతిస్తుంది.