ETV Bharat / business

మరింత పెరగనున్న పెట్రో ధరలు.. ఇవే కారణాలు... - పెట్రోల్ ధర ఎంత

దేశంలోని ప్రజలకు పిడుగులాంటి వార్త! పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Diesel price) మళ్లీ ఆకాశాన్నంటనున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఉన్న ధరలు మరింత పెరగనున్నాయి. మూడేళ్లలో ఎన్నడూ లేనంత అధిక స్థాయికి అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు (Crude Oil prices) చేరుకున్నాయి. ఈ ప్రభావం దేశంలో తీవ్రంగానే ఉండనుంది.

petrol price hike in india
పెట్రోల్ రేట్
author img

By

Published : Sep 28, 2021, 5:28 PM IST

Updated : Sep 28, 2021, 6:14 PM IST

అంతర్జాతీయంగా చమురు ధరలకు (Brent Crude Price) రెక్కలొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 80 డాలర్లు దాటిపోయింది. గత మూడేళ్లలో ముడి చమురు ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ఈ ప్రభావంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై గట్టిగానే ఉండనుంది. ఇప్పటికే సెంచరీలు కొట్టిన ఇంధన ధరలు(Petrol Diesel price).. మరింత పెరిగిపోనున్నాయి.

ముడి చమురు ధరలు 80 డాలర్లతో ఆగిపోయేలా (crude oil prices opec) కనిపించడం లేదు. ఇదివరకటి అంచనాలను సంస్థలన్నీ సవరిస్తున్నాయి. బ్రెంట్ చమురు ధర బ్యారెల్​కు 87 డాలర్లకు చేరుకోనుందని (Crude Oil forecast 2021) వాల్​స్ట్రీట్ బ్యాంక్ అంచనా వేసింది. మరోవైపు, ఈ ఏడాది చివరి నాటికి ముడి చమురు ధర.. 90 డాలర్లకు చేరుకోనుందని గోల్డ్​మన్ శాక్స్ (Goldman Sachs Crude oil) లెక్కగట్టింది. ముడిచమురు రంగంలో 'బుల్ ట్రెండ్' చాలా రోజులుగా ఉండనుందని, ప్రపంచ వ్యాప్తంగా సరఫరా-డిమాండ్ మధ్య అంతరం ఊహించినదానికంటే ఎక్కువగా ఉందని గోల్డ్​మన్ శాక్స్ వ్యూహకర్తలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గ్యాసోలిన్, ఇతర పెట్రో అనుబంధ ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని సీఎన్ఎన్ పేర్కొంది.

ఇకపై ఎలా ఉంటుందో...

దేశంలో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు.. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు సాధారణంగా ఉన్నప్పుడే దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయి. ఇక అంతర్జాతీయ ధరలకే రెక్కలు వస్తే దేశంలో వీటి రేట్లు ఏ స్థాయిలో ఉంటాయోనని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

ఒకప్పుడు అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్​కు వంద డాలర్లు దాటినా.. దేశంలో ధరలు పెద్దగా పెరగలేదు. 2013లో క్రూడ్ ఆయిల్ ధర (Crude oil prices in 2013) బ్యారెల్​కు 106.46 డాలర్లుగా ఉండగా.. ఆ సమయంలో దిల్లీలో (Petrol prices in 2013) పెట్రోల్ రేటు లీటరుకు సగటున రూ.69.53 గా ఉంది. యూపీఏ రెండో పాలనలో అంతర్జాతీయంగా ఆయిల్ రేట్లు జీవితకాల గరిష్ఠానికి చేరాయి. 2012 మార్చిలో బ్రెంట్ ధర రూ.123.61కి చేరింది. ఆ సమయంలోనూ దేశంలో పెట్రోల్ ధరలు సాధారణంగా ఉండటం గమనార్హం.

సుంకాలు విధించి బాదుడు...

ఆ తర్వాత, అంతర్జాతీయంగా రేట్లు దిగొచ్చినా.. దేశంలో పెట్రోల్ ధరలు మాత్రం అదే స్థాయిలో కొనసాగాయి. 2017లో కేంద్ర ప్రభుత్వం రోజువారీ పెట్రోల్ రేట్ల సవరణ విధానం తీసుకొచ్చింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో పెట్రోల్ రేట్లు నిర్ణయిస్తోంది. అయితే, కొవిడ్ సమయంలో డిమాండ్ పడిపోయి బ్యారెల్ ధర 20 డాలర్లకు చేరినా.. ఈ ఫలాలు దేశంలో సామాన్యుడికి బదిలీ కాలేదు. పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా కొనసాగాయి. ఎక్సైజ్ సుంకాల్ని పెంచడమే ఇందుకు ప్రధాన కారణం. కేంద్రం పెంచిన ఎక్సైజ్ సుంకం ఎంత? దాని పరిణామాలేంటన్న వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

దండుకుంటున్న ప్రభుత్వాలు!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చమురు రంగం ద్వారా వచ్చే ఆదాయం గత ఐదేళ్లలో 66 శాతం పెరిగింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.5.5 లక్షల కోట్లను ప్రభుత్వాలు వసూలు చేశాయి. అసలు పెట్రోల్​పై ఎక్కువగా దండుకుంటుంది కేంద్రమా? రాష్ట్ర ప్రభుత్వాలా? ఈ వార్త చదివి తెలుసుకోండి..

డిమాండ్​కు తగిన సరఫరా లేకపోవడమే అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. చమరు ఉత్పత్తిని పెంచాలని ఒపెక్ ప్లస్ దేశాలను అమెరికా పదేపదే కోరుతున్నా.. ఆ కూటమి దీనిపై ఏకాభిప్రాయం తీసుకోలేకపోతోంది.

ప్రస్తుతం రేట్లు ఇలా..

మంగళవారం దిల్లీలో (Fuel Price Today) లీటర్​ పెట్రోల్​ ధర 19 పైసలు పెరగ్గా.. డీజిల్​పై 25 పైసలు పెరిగింది. దీంతో దేశరాజధానిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.101.42కు చేరగా.. డీజిల్​ ధర రూ. 89.58కు పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, గుంటూర్​లో పెట్రోల్ రేట్ల వివరాలను ఈ లింక్​పై క్లిక్ చేసి తెలుసుకోండి.

ఇవీ చదవండి:

Last Updated : Sep 28, 2021, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.