ETV Bharat / business

బీపీసీఎల్‌ ప్రైవేటీకరణ.. ఎవరి సొంతం? - బీపీసీఎల్ సంస్థ

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ ప్రైవేటీకరణ కోసం ప్రాథమిక బిడ్ల దాఖలుకు గడువు నేటితో ముగియనుంది. బీపీసీఎల్‌లో ప్రభుత్వం తనకు ఉన్న 52.98 శాతం వాటా మొత్తాన్ని విక్రయించనుంది. అయితే.. ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాలపై ప్రపంచం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో బీపీసీఎల్‌ వాటా కొనుగోలు చేయడం కలిసి రాదని పలు దిగ్గజ సంస్థలు భావిస్తున్నాయి.

BPCL
బీపీసీఎల్‌ ప్రైవేటీకరణ.. ఎవరి సొంతం?
author img

By

Published : Nov 16, 2020, 7:16 AM IST

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) ప్రైవేటీకరణ కోసం ప్రాథమిక బిడ్ల దాఖలుకు గడువు నేటి (సోమవారం)తో ముగియనుంది. దేశీయంగా రెండో అతిపెద్ద రిఫైనింగ్‌-మార్కెటింగ్‌ కంపెనీ, 12000 మంది ఉద్యోగులున్న బీపీసీఎల్‌లో ప్రభుత్వం తనకు ఉన్న 52.98 శాతం వాటా మొత్తాన్ని విక్రయించనుంది. ఆసక్తి వ్యక్తీకరణ బిడ్ల దాఖలుకు సమయాన్ని ఇప్పటికే 4 సార్లు పొడిగించిన సంగతి విదితమే. ఈనెల 16 నుంచి గడువును మరోసారి పొడిగించబోమని పెట్టుబడులు, ప్రజాఆస్తుల నిర్వహణ (దీపమ్‌) కార్యదర్శి తుహిన్‌ కాంతా పాండే ఇప్పటికే స్పష్టంచేశారు.

ప్రపంచ దిగ్గజ సంస్థలైన బ్రిటన్‌కు చెందిన బీపీ పీఎల్‌సీ, ఫ్రాన్స్‌కు చెందిన టోటల్‌, సౌదీ అరేబియా ఆరామ్‌కో, రష్యా సంస్థ రోస్‌నెఫ్ట్‌ బిడ్లు దాఖలు చేయకపోవచ్చనే సంకేతాలు ఇప్పటికే ఉన్నాయి. ఒకపక్క సంప్రదాయ ఇంధన వినియోగం తగ్గించుకుని, పర్యావరణ అనుకూల సౌరవిద్యుత్తు, హైడ్రోజన్‌ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాలపై ప్రపంచం దృష్టి సారిస్తున్న సమయంలో రూ.70,000 కోట్లకు పైగా వెచ్చించి, బీపీసీఎల్‌ వాటా కొనుగోలు చేయడం కలిసి రాదనే ఆయా సంస్థలు భావిస్తున్నాయని చెబుతున్నారు.

  • శనివారం నాటి బీపీసీఎల్‌ షేరు ముగింపు ధర రూ.412.70 ప్రకారం, సంస్థలో ప్రభుత్వానికి ఉన్న 52.98 శాతం విలువ రూ.47,430 కోట్లు అవుతుంది. దీంతోపాటు మరో 26 శాతం వాటా కొనుగోలుకు కూడా ఓపెన్‌ ఆఫర్‌ కోసం మరో రూ.23,276 కోట్లు అవుతుంది.
  • ఏటా బీపీసీఎల్‌ రూ.8000 కోట్ల వరకు లాభాలు ఆర్జిస్తోంది. అంటే ఈ కంపెనీని స్వాధీనం చేసుకునేందుకు వెచ్చించిన మొత్తం ఆర్జించాలంటే 8-9 ఏళ్లు పడుతుంది.

రిలయన్స్‌కు ఎందుకు ఉపయోగం?

ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీని నిర్వహిస్తున్న ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌).. ఇంధన రిటైల్‌ వ్యాపారాన్ని గణనీయంగా విస్తరించేందుకు అయితే బీపీసీఎల్‌ కొనుగోలు ఉపకరిస్తుందని పరిశ్రమ వర్గాల అంచనా. బీపీసీఎల్‌కు బిడ్‌ వేసేందుకే బీపీసీఎల్‌ మాజీ ఛైర్మన్‌ సర్ధాక్‌ బెహూరియా, ఐఓసీ మాజీ ఛైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌లను ఇప్పటికే ఆర్‌ఐఎల్‌ తమ గ్రూపులో చేర్చుకుందనే అంచనాలున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.