టీఆర్పీ అవకతవకల కేసులో అరెస్టయిన బార్క్ మాజీ సీఈఓ పార్థో దాస్‌గుప్తాకు బెయిల్ మంజూరు చేసింది బాంబే హైకోర్టు. రూ. 2లక్షల పూచీకత్తు, పాస్‌పోర్టును కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. 6 నెలల పాటు ప్రతి నెలా క్రైం బ్రాంచ్ పోలీసుల ముందు హాజరుకావాలని సూచించింది.
టీఆర్పీ అవకతవకల కేసులో పార్థోను గతేడాది డిసెంబర్లో అరెస్టు చేశారు ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులు. ఈ కేసులో అరెస్టైన పదిహేనో వ్యక్తి ఆయన.
టీఆర్పీల కోసం కొన్ని ఛానళ్లు మోసాలకు పాల్పడుతున్నాయంటూ బార్క్.. పలు మీడియా సంస్థలపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. టీఆర్పీలు పెంచుకోవటానికి కొన్ని కుటుంబాలకు డబ్బులు ఇచ్చి మరీ.. తమ ఛానళ్లను చూసేలా మీడియా సంస్థలు చేస్తున్నాయంటూ బార్క్ ఆరోపిస్తోంది.
ఇదీ చదవండి : టీఆర్పీ స్కాం కేసులో బార్క్ మాజీ సీఈఓ అరెస్ట్
ఇదీ చదవండి : టీఆర్పీ కోసం అర్ణబ్ భారీగా నగదు ముట్టజెప్పారా?