ETV Bharat / business

రిమోట్​ పార్కింగ్​ ఫీచర్​తో బీఎండబ్ల్యూ కొత్త కారు - బీఎండబ్ల్యూ కొత్త మోడల్​ కారు

లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. 5సీరిస్​​లో సరికొత్త మోడల్​ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.62.9 లక్షలతో ప్రారంభం కానుంది. ఈ మోడల్​లో రిమోట్​ కంట్రోల్​ పార్కింగ్​, హెడ్​-అప్​ డిస్ప్లే వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

bmw updated 5 series
బీఎండబ్ల్యూ న్యూ మోడల్​ కారు
author img

By

Published : Jun 24, 2021, 9:36 PM IST

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ 5 సీరిస్​ సెడాన్​ కార్లలో అప్​డేటెడ్​ వెర్షన్​ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.62.9 లక్షలతో ప్రారంభమవుతుందని ప్రకటించింది.

దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ఈ మోడల్​ పెట్రోల్​ వేరియంట్​ (బీఎండబ్ల్యూ 530ఐ ఎం స్పోర్ట్) ధర రూ.62.9 లక్షలుగా నిర్ణయించింది. డీజిల్​ ఇంజిన్​తో​.. బీఎండబ్ల్యూ 530డీ ఎం స్పోర్ట్​, బీఎండబ్ల్యూ 520డీ లగ్జరీ లైన్​ పేర్లతో రెండు వేరియంట్లను తీసుకువచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.63.9లక్షలు, రూ.71.9లక్షలుగా నిర్ణయించింది.

ఫీచర్లు ఇవే..

ఈ మోడల్​లో అధునాతన ఫీచర్లను పొందుపరిచింది బీఎండబ్ల్యూ. రిమోట్​ కంట్రోల్​ పార్కింగ్​, హెడ్​-అప్​ డిస్ప్లే, రివర్సింగ్​ అసిస్టెంట్​, పార్కింగ్​ అసిస్టెంట్​, జెస్టర్​ కంట్రోల్​ వంటి ఫీచర్లు ఇందులో ముఖ్యమైనవి.

అదిరే స్పీడుతో..

  • బీఎండబ్ల్యూ 530ఐ- 0 నుంచి 100 కిలో మీటర్ల వేగాన్ని కేవలం 6.1 సెకన్లలోనే అందుకోగలదు.
  • బీఎండబ్ల్యూ 520డీ- 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 7.3 సెకన్లలో అందుకుంటుంది
  • బీఎండబ్ల్యూ 530డీ- 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 5.7 సెకన్లలో అందుకునే సామర్థ్యం దీని సొంతం

ఇదీ చూడండి: టాటా, మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్లు!

ఇదీ చూడండి: బడ్జెట్​ ధరలో 'ఎస్​యూవీ' కావాలా? ఇవి ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.