టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఏం చేసినా సంచలనమే. తాజాగా.. ఉత్తర అమెరికాలోని బిట్‌కాయిన్ మైనర్లతో మాట్లాడానని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో బిట్‌కాయిన్ ఒక్క రోజులో ఏకంగా 19 శాతం పుంజుకుంది. దీనితో బిట్‌కాయిన్ విలువ తిరిగి 39,944 డాలర్లకు చేరింది. ఆదివారం (మే 23) నాటికి బిట్‌కాయిన్ విలువ 31,132 డాలర్లుగా ఉండటం గమనార్హం.
ఆ ట్వీట్లో ఏముంది?
"ఉత్తర అమెరికాలోని బిట్‌కాయిన్ మైనర్లతో మాడ్లాడాను. వారు ప్రణాళికబద్దంగా పునరుత్పాదక వినియోగానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మైనర్లు కూడా దీనిని పాటించాలని కోరమని చెప్పాను." - మస్క్ ట్వీట్
ఈ ఏడాది ప్రారంభంలో టెస్లా కార్లు కొనేందుకు బిట్‌కాయిన్ ఉపయోగించొచ్చని అధికారికంగా ప్రకటించిన మస్క్.. ఇటీవల ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. బిట్‌కాయిన్ మైనింగ్ వల్ల ఏర్పడుతున్న కాలుష్యం ఇందుకు కారణంగా తెలిపారు. ఈ నేపథ్యంలో బిట్‌కాయిన్ విలువ ఇటీవల రికార్డు స్థాయిలో పడిపోయింది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో బిట్‌కాయిన్ మైనింగ్ చేసే వారితో మస్క్ మాట్లాడటం గమనార్హం.
ఇదీ చదవండి:కొవిడ్ వేళ.. భగ్గుమంటున్న ధరలు