ETV Bharat / business

బిగ్‌ బుల్‌ వదిలేసిన షేర్లకు పెరిగిన విలువ! - రాకేశ్ ఝున్​ఝున్​వాలా

ప్రముఖ స్టాక్​ మార్కెట్ పెట్టుబడిదారు రాకేశ్​ ఝున్​ఝున్​వాలా ఇటీవల తొమ్మిది సంస్థల్లోని వాటాల్లో కొంతభాగాన్ని ఉపసంహరించుకున్నారు. అయితే కొన్ని సంస్థల షేర్ల విలువ గణనీయంగా పెరిగింది. ఫెడరల్​ బ్యాంక్, యాప్​టెక్​, ఫోర్టిస్​ హెల్త్​కేర్, ఎస్కార్ట్స్, ఫస్ట్‌కోర్స్‌ సొల్యూషన్స్‌ షేర్లు లాభపడ్డాయి.

big bull
బిగ్‌ బుల్‌ వదిలేసిన షేర్లకు పెరిగిన విలువ!
author img

By

Published : Mar 6, 2021, 10:28 PM IST

షేర్‌ మార్కెట్‌ బిగ్‌ బుల్‌గా పిలిచే రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా మూడో త్రైమాసికంలో వదులుకున్న కొన్ని షేర్లు అనూహ్యంగా పుంజుకోవడం గమనార్హం. మొత్తం తొమ్మిది కంపెనీల్లో ఆయన తన వాటాల్లో కొంత భాగాన్ని ఉపసంహరించుకున్నారు. వాటిలో కొన్ని కంపెనీల షేర్ల విలువ గణనీయంగా వృద్ధి చెందింది.

ఝున్‌ఝున్‌వాలా మోస్ట్‌ ఫేవరెట్‌ అయిన టైటాన్‌ కంపెనీ సహా క్రిసిల్‌, యాప్‌టెక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ర్యాలిస్‌ ఇండియా, ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌, ఆటోలైన్ ఇండస్ట్రీస్‌, ఎస్కార్ట్స్‌, ఫస్ట్‌కోర్స్‌ సొల్యూషన్స్‌ కంపెనీల వాటాల నుంచి ఝున్‌ఝున్‌వాలా కొంత భాగాన్ని విక్రయించారు. వీటిలో ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌, క్రిసిల్‌ మినహా మిగతా కంపెనీల షేర్లన్నీ మార్చి 2020 నాటి కనిష్ఠాల నుంచి దాదాపు రెట్టింపవడం విశేషం. యాప్‌టెక్‌ కంపెనీలోని తన వాటా నుంచి బిగ్‌ బుల్‌ 0.17 శాతం విక్రయించారు. దీంతో ఆ కంపెనీలో ఆయన వాటా మూడో త్రైమాసికంలో 23.84 శాతానికి తగ్గింది.

అనంతరం 2021 ఆరంభం నుంచి యాప్‌టెక్‌ షేర్లు 39 శాతం ఎగబాకాయి. ప్రస్తుతం ఒక్కో ఈక్విటీ షేరు విలువ రూ.218గా ఉంది. ఇక ఫెడరల్‌ బ్యాంక్‌ నుంచి ఝున్‌ఝున్‌వాలా 0.31 శాతం వాటాల్ని విక్రయించారు. దాని షేర్లు సైతం జనవరి 1 తర్వాత 29 శాతం పుంజుకున్నాయి. ఇదే కోవలో ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ షేర్లు 13.46 శాతం, ఎస్కార్ట్స్‌ షేర్లు 2.8 శాతం, ఫస్ట్‌కోర్స్‌ సొల్యూషన్స్‌ షేర్లు 5.6 శాతం లాభపడ్డాయి.

అయితే, ఝున్‌ఝున్‌వాలా విక్రయించిన షేర్లలో కొన్నింటి విలువ పడిపోయింది కూడా. వాటిలో ఆయన ఎంతో కాలం నిలిపి ఉంచిన టైటాన్ ఒకటి. జనవరి నుంచి ఈ సంస్థ షేరు విలువ 5.4 శాతం కుంగింది. ఇదే బాటలో ఆటోలైన్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 3.8 శాతం, ర్యాలిస్‌ ఇండియా షేర్లు 3.16 శాతం, క్రిసిల్‌ షేర్ల విలువ 1.33 శాతం దిగజారింది.

ఇదీ చదవండి : క్రిప్టోకరెన్సీపై ఆర్థిక శాఖ కీలక ప్రకటన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.