దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా టీకాల్లో కొవాగ్జిన్ ఒకటి. కరోనా రెండో దశ నేపథ్యంలో టీకా ప్రక్రియను వేగవంతం చేయగా, అందుకు తగ్గట్టుగానే వ్యాక్సిన్లు తయారీ చేస్తోంది కొవాగ్జిన్. ఇంతకీ టీకాల తయారీ ప్రారంభించిన నాటి నుంచి అవి బయటకు వచ్చేందుకు ఎంత సమయం పడుతుంది?
ఒక్కో కొవాగ్జిన్ టీకా బ్యాచ్ తయారీ, టెస్టింగ్ నుంచి విడుదల వరకు దాదాపు 120 రోజులు పడుతుంది. అంటే 4 నెలలు.
ఇందుకు కారణం అంతర్జాతీయ ప్రమాణాల కనుగుణంగా గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ పాటిస్తూ, పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెగులేటరీ ఏజెన్సీలను అనుమతుల ప్రక్రియను దాటుకొని రావాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది. అలా మార్చిలో తయారీ పూర్తి చేసుకున్న ఒక బ్యాచ్ కోవాగ్జిన్ జూన్‌లో అందుబాటులోకి వస్తుందని భారత్ బయోటెక్ తెలిపింది. అక్కడి నుంచి కేంద్రానికి, అక్కడి నుంచి వ్యాక్సినేషన్ కేంద్రాలకు సరఫరాకు మరింత ఆలస్యమవుతుందంది. కంపెనీ నుంచి కేంద్ర, రాష్ట్ర నిల్వల కేంద్రానికి తమ కంపెనీ రెండు రోజుల్లో వ్యాక్సిన్లను చేరవేయగలం కానీ.. అక్కడి నుంచి రాష్ట్రాలు, జిల్లాలు, వ్యాక్సినేషన్ కేంద్రాలకు చేరటానికి మరింత సమయం పడుతుందని కంపెనీ తెలిపింది. ప్రమాణాలకనుగుణంగా వ్యాక్సిన్లు తయారు చేయాల్సి ఉంటుంది కనుక తయారీని సైతం దశల వారీగా పెంచాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:- covaxin: భారత్ బయోటెక్‌తో జీసీవీసీ ఒప్పందం