గేమింగ్ స్మార్ట్ ఫోన్లు కొంత కాలం కిందట ఎక్కువ ధర ఉండేవి. వీటి ట్రెండ్ మారటంతో ధరలు తగ్గాయి. వీటిని కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా గతంలో పోల్చితే బాగా పెరిగింది. పబ్జీ, సీఓడీ మొబైల్, ఆస్పాల్ట్, గెన్షిన్ ఇంపాక్ట్ తదితర గేమ్‌లు భారతీయ యువతలో క్రేజ్ సంపాదించుకున్నాయి. హైఎండ్ గేమ్‌లను మొబైల్లో ఆడేందుకు ఇష్టపడడమే ఇందుకు కారణం. దీనితో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా ఈ విభాగంలో ఫోన్లను తీసుకువస్తున్నాయి.
ప్రొసెసర్ తయారీదారులు గేమింగ్ కోసం ప్రత్యేక ప్రాసెసర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీలు, ఎక్కువ రిఫ్రెష్ రేట్ ఉన్న స్ర్కీన్లు, కూలింగ్ సిస్టమ్, రెండు స్టీరియో స్పీకర్లు తదితర ఫీచర్లతో గేమింగ్ అనుభూతిని పెంచుతున్నారు.
ఆసస్ రాగ్ ఫోన్ 5 మినహా గేమింగ్ ఫోన్లు భారత్ లో లేవు. పోకో, షియోమీ, ఐక్యూఓఓ, శాంసంగ్‌లు గేమ్స్‌కు వీలుగా ఫోన్లను తీసుకొచ్చాయి.
అసస్ రాగ్ ఫోన్ 5
ఈ ఫోన్ మూడు వేరియంట్లలో(5, 5 ప్రో, 5 అల్టిమేట్) అందుబాటులో ఉంది. వీటిలో ర్యామ్, స్టోరేజ్లతో పాటు డిజైన్లలో తేడాలు ఉన్నాయి. 5 ప్రో ధర రూ. 69,999, 5 అల్టిమేట్ ధర రూ. 79,999గా ఉంది. పెర్ఫార్మెన్స్, గేమింగ్ ఫీచర్లు, డిస్ప్లే, స్పీకర్లు ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణలు. సాధారణ ఫోన్‌తో పోలిస్తే ఇది కొంచెం మందంగా, బరువుగా ఉంటుంది.
అసస్ రాగ్ ఫోన్ 5 ఫీచర్లు..
డిస్ప్లే: 6.78 ఇంచుల ఫుల్ హెచ్డీ అమోల్డ్, 144 హెర్జ్
ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 888
ర్యామ్ : 8జీబీ
స్టోరేజ్ : 128 జీబీ
బ్యాక్ కెమెరా : 64+13+5ఎంపీ
ఫ్రంట్ కెమెరా : 24 ఎంపీ
బ్యాటరీ : 6000 ఎంఏహెచ్
ఛార్జింగ్ : 30 వాట్స్(65 వాట్స్ సపోర్ట్ చేస్తుంది)
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 11
బరువు, మందం : 242 గ్రాములు, 10.3 ఎంఎం
ధర : రూ. 47,999
ఐక్యూఓఓ 7 లెజెండ్
పెర్ఫార్మెన్స్, డిస్ప్లే, స్టీరియో స్పీకర్లు దీని ప్రధాన ఆకర్షణలు. బ్యాటరీ, సాఫ్ట్వేర్ అంచనాలను అందుకోలేదని చెప్పుకోవచ్చు. 66 వాట్స్ ఛార్జింగ్ సదుపాయంతో కేవలం 22 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అవుతుందని కంపెనీ చెబుతోంది.
ఫీచర్లు ఇవే..
డిస్ప్లే: 6.62 ఇంచుల ఫుల్ హెచ్డీ అమోల్డ్, 120 హెర్జ్
ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 888
ర్యామ్ : 2/12 జీబీ
స్టోరేజ్ : 128/256 జీబీ
బ్యాక్ కెమెరా : 48+13+13ఎంపీ
ఫ్రంట్ కెమెరా : 16 ఎంపీ
బ్యాటరీ : 4000 ఎంఏహెచ్
ఛార్జింగ్ : 66వాట్స్
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 11
బరువు, మందం : 209.5 గ్రా, 8.7 ఎంఎం
షియోమీ ఎంఐ 11ఎక్స్
గేమింగ్ కోసం ఎక్కువ ధర పెట్టకూడదనుకునే వారు దీనిని పరిగణనలోకి తీసుకోవచ్చు. ధర పరంగా కొంత తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. అమోల్డ్ స్ర్కీన్, కెమెరాలు దీని ప్రధాన ఆకర్షణలు. ఫాస్ట్ ఛార్జింగ్ లేకపోవటం దీనికి మైనస్.
ఫీచర్లు ఇవే..
డిస్ప్లే: 6.67 ఇంచుల ఫుడ్ హెచ్డీ+, 120 హెర్జ్
ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 870
ర్యామ్ : 6/8జీబీ
స్టోరేజ్ : 128 జీబీ
బ్యాక్ కెమెరా : 48+8+5ఎంపీ
ఫ్రంట్ కెమెరా : 20 ఎంపీ
బ్యాటరీ : 4520 ఎంఏహెచ్
ఛార్జింగ్ : 33 వాట్స్
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 11
బరువు, మందం : 196 గ్రా, 7.8 ఎంఎం
ధర: రూ. 29,999
శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ
కొన్నేళ్ల నుంచి ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను శాసించిన ఫోన్ ఇది. పవర్ ఎఫిషియెంట్ పెర్ఫార్మెన్స్, గేమింగ్ పర్ఫార్మెన్స్ ఫ్లాగ్షిప్ స్థాయిలో ఉంటుంది. ఐపీ 68 రేటింగ్, వైర్లెస్ ఛార్జింగ్ లాంటి ప్రీమియం ఫీచర్లుగా ఉన్నాయి. కెమెరాలు, డిస్ప్లేలు దీని ప్రధాన ఆకర్షణలు. ఛార్జింగ్, బ్యాటరీ లైఫ్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు.
ఫీచర్లు...
డిస్ప్లే: 6.7 ఇంచుల ఫుల్ హెచ్డీ, సూపర్ అమోల్డ్, 120 హెర్జ్
ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 865
ర్యామ్ : 8జీబీ
స్టోరేజ్ : 128 జీబీ
బ్యాక్ కెమెరా: 12+8+12 ఎంపీ
ఫ్రంట్ కెమెరా: 32 ఎంపీ
బ్యాటరీ : 4500 ఎంఏహెచ్
ఛార్జింగ్ : 25వాట్స్
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 11
బరువు, మందం : 190 గ్రా, 8.4 ఎంఎం
ధర : రూ. 47999
పోకో ఎక్స్3 ప్రో
బడ్జెట్ రేంజ్లో గేమింగ్ ఫోన్‌గా దీన్ని చెప్పుకోవచ్చు. పెర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్, కెమెరాలు దీని ప్రధాన ఆకర్షణలు. ఛార్జింగ్ స్పీడ్ నెమ్మదిగా ఉంటుంది. లిక్విడ్ కూల్ టెక్నాలజీ వల్ల హీటింగ్ సమస్య చాలా తక్కువగా ఉంటుంది.
ఫీచర్లు..
డిస్ప్లే: 6.67 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్, ఎల్సీడీ, 120 హెర్జ్
ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 860
ర్యామ్ : 6/8జీబీ
స్టోరేజ్ : 128 జీబీ
బ్యాక్ కెమెరా: 48+8+2+2 ఎంపీ
ఫ్రంట్ కెమెరా: 20 ఎంపీ
బ్యాటరీ : 5160 ఎంఏహెచ్,
ఛార్జింగ్ : 33 వాట్స్
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 11, ఎంఐ యూఐ 12
బరువు, మందం : 213 గ్రా, 9.4 ఎంఎం
ధర : రూ. 18,999
ఇదీ చూడండి: Smart band: తక్కువ ధరలో స్మార్ట్ బ్యాండ్ కావాలా?