ETV Bharat / business

ఈ-స్కూటర్ కొనాలా? బెస్ట్ మోడల్స్ ఇవే... - ప్యూర్ ఈవీ ఎప్లూటో 7జీ ధర

దేశంలో పెట్రోల్ రేట్లు మండిపోతున్నాయి. దీనికి తోడు కాలుష్యంపై పెరిగిన అవగాహనతో విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రత్యేకించి ద్విచక్ర వాహనాల (స్కూటర్లు) విషయంలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మరి ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏవి? వాటి ప్రత్యేకతలు ఏమిటి?

Best E scooters
బెస్ట్ ఈ-స్కూటర్లు
author img

By

Published : Jul 27, 2021, 2:19 PM IST

పెట్రోల్ రేట్ల భారంతో.. చాలామంది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఎలక్ట్రిక్ కార్ల విషయంలో వినియోగదారులు సందిగ్ధపడుతున్నప్పటికీ.. ద్విచక్ర వాహనాల విషయంలో మాత్రం కొనుగోళ్లకు సుముఖత చూపుతున్నారు. పెట్రోల్​ స్కూటర్లతో పోలిస్తే.. వీటి నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండడం ఇందుకు కారణం.

అయితే స్కూటర్ల విషయంలో అవసరాలు అందరికీ ఒకేలా ఉండవు. అందుకే.. అన్ని రకాల అవసరాలను తీర్చే విధంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తెస్తున్నాయి కంపెనీలు. మరి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్​ స్కూటర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.

ఏథర్ 450 ఎక్స్

  • ఏథర్ 450 ఎక్స్ స్కూటర్ 2.7 కిలోవాట్ అవర్ బ్యాటరీతో అందుబాటులో ఉంది
  • రైడింగ్ రేంజ్ 116 కిలో మీటర్లు
  • బ్యాటరీ పూర్తి ఛార్జింగ్​కు 5 గంటల సమయం పడుతుంది
  • ఈ స్కూటర్ టాప్​ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు
  • డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది.
  • ప్రారంభ ధర (ఎక్స్​ షోరూం) రూ. 1.61 లక్షలు
    Ather 450X
    ఏథర్ 450 ఎక్స్

బజాజ్ చేతక్

1990ల సమయంలో బజాజ్ చేతక్​ ఓ సంచలనం. అందుకే ఇదే పేరుతో ఇప్పుడు ఎలక్ట్రిక్​ స్కూటర్​ను తీసుకొచ్చింది బజాజ్ ఆటో.

  • ఈ ఎలక్ట్రిక్ స్కూటర్.. అర్బేన్, ప్రీమియం వేరియంట్లలో లభిస్తోంది.
  • వీటి ప్రారంభ ధరలు వరుసగా.. రూ. లక్ష, రూ. 1.15 లక్షలుగా ఉన్నాయి
  • ఎల్‌ఈడీ లైట్లతో పాటు డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్‌ ఈ స్కూటర్​లో పొందుపరిచింది బజాజ్​
  • 4 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఇందులో ఉంది
  • ఒక్క సారి ఫుల్​ ఛార్జింగ్ చేస్తే 95 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు
  • 3 కిలోవాట్ల లిథియం-అయాన్ ఏపీ-67 రేటెడ్ బ్యాటరీని పొందుపరిచింది బజాజ్
  • సాధారణ ఛార్జింగ్ పాయింట్ నుంచైతే 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.
  • టాప్ స్పీడ్ 78 కిలో మీటర్లు/గంటకు
    all new Bajaj Chetak
    సరికొత్త బజాజ్ చేతక్​

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్

ద్విచక్ర వాహన మార్కెట్లో ప్రముఖమైన టీవీఎస్ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది.

  • ఈ స్కూటర్​లో 4.4 కిలో వాట్స్​ ఎలక్ట్రిక్ మోటార్​ ఉంది
  • ఎకానమీ, పవర్ మోడ్​లకు మారవచ్చు (ఇది రైడింగ్ రేంజ్​పై ప్రభావం చూపొచ్చు)
  • ఒక్క పూర్తిగా ఛార్జ్​ చేస్తే.. 75 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు
  • 2.25 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఇందులో ఉంది
  • గరిష్ఠ స్పీడ్ గంటకు​ 78 కిలో మీటర్లు
  • దీని ధర(దిల్లీ ఎక్స్ షోరూం) రూ. లక్ష
    TVS iQube
    టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్

ఒకినావా ఐ ప్రేజ్

  • ఒకినావా ఐ ప్రేజ్ స్కూటర్ లో 2.5 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్​ ఉంటుంది
  • ఎకో, స్పోర్ట్, టర్బో రైడ్ మోడ్​లు ఉన్నాయి.
  • ఒక్క సారి పూర్తిగా ఛార్జ్​ చేస్తే.. 160 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు
  • గరిష్ఠ వేగం గంటకు 75 కిలోమీటర్లు
  • ఇందులో సులంభంగా మార్చుకోగల 72 వోల్ట్ డ్యూయల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది
  • దీని బ్యాటరీ ఫుల్​ ఛార్జ్ అయ్యేందుకు 3 గంటలు పడుతుంది.
  • ధర రూ. 1.08 లక్షలు

హీరో ఫోటాన్ హెచ్‌ఎక్స్

  • ఈ స్కూటర్​ను ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. 85 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
  • గరిష్ఠ వేగం 45 కిలోమీటర్లు మాత్రమే
  • పూర్తి ఛార్జ్​కు 5 గంటల సమయం పడుతుంది
  • 4 కిలోవాట్ అవర్ మోటార్ ఈ స్కూటర్లో ఉంది.
  • ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 80,000
    Hero Electric E-scooters
    హీరో ఎలక్ట్రిక్ ఈ-స్కూటర్లు

ప్యూర్ ఈవీ ఎప్లూటో 7జీ

  • ప్యూర్ ఈవీ ఎప్లూటో 7జీ స్కూటర్​లో 2.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది
  • 120 కిలోమీటర్ల వరకు రైడ్ రేంజ్‌
  • గరిష్ఠ వేగం గంటకు 60 కిలోమీటర్లు
  • ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ రైడింగ్ మోడ్‌లు మార్చేందుకు ఆప్షన్లు ఉన్నాయి
  • వెనుక వైపు డ్రమ్ బ్రేక్‌లు, ముందు వీల్​కు డిస్క్ బ్రేక్ ఉన్నాయి
  • పూర్తి ఛార్జింగ్​కు 4 గంటల సమయం పడుతుంది
  • బ్యాటరీ యూనిట్​ను తీయవచ్చు కాబట్టి ఎక్కడైనా ఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది
  • దీని ధర (ఎక్స్ షోరూం) రూ. 87,593
    Pure EV E-scooters
    ప్యూర్ ఈవీ ఈ-స్కూటర్లు

ఇదీ చదవండి:ఈ-బైక్​ కొనాలనుకుంటున్నారా.. ఇవి మీ కోసమే!

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.