మీకు ఈ వారం బ్యాంకుల్లో ఏదైనా పని ఉంటే.. ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఈ వారం బ్యాంకులు 5 రోజులు వరుస సెలవులో (Bank Holidays) ఉండనున్నాయి. వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పండుగల సందర్భంగా బ్యాంకులు పని చేయడం లేదు.
సెలవుల వివరాలు ఇలా...
- సెప్టెంబర్ 8- శ్రీమంత శంకరదేవ తిథి సందర్భంగా అసోంలో బ్యాంకులు పని చేయవు
- సెప్టెంబర్ 9, 10- తీజ్ కారణంగా సిక్కింలో బ్యాంకులు సెలవులో ఉండనున్నాయి
- సెప్టెంబర్ 10- వినాయక చవితి సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు
- సెప్టెంబర్ 11- రెండవ శనివారం బ్యాంకులు పని చేయవు. (పలు నగరాల్లో వినాయక చవితి కూడా)
- సెప్టెంబర్ 12- ఆదివారం(బ్యాంకులకు సాధారణ సెలవు)
ఇక సెప్టెంబర్ మొత్తం మీద చూస్తే.. బ్యాంకులు 12 రోజులు సెలవులో (Bank holidays in September) ఉండనున్నాయి. ఈ వారం ఐదు రోజుల సెలవులతో కలిపి.. వివిధ కారణాలతో బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి.
ఇదీ చదవండి: సెప్టెంబరులో బ్యాంకు హాలిడేస్ ఇవే..