దేశంలోని 400 జిల్లాల్లో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్బీఎఫ్సీ)లతో ప్రభుత్వ రంగ బ్యాంకులు సమావేశమవుతాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆర్థిక మాంద్యాన్ని నిరోధించేందుకు గురువారం ప్రభుత్వ రంగ బ్యాంకుల అధినేతలతో సమావేశమైన కేంద్ర మంత్రి.. కీలక నిర్ణయాలను ప్రకటించారు. రుణాలు ఇచ్చేందుకు ఎన్బీఎఫ్సీల వద్ద ద్రవ్యలభ్యత ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ సమావేశాలు రెండు దశల్లో జరుగుతాయని నిర్మలా పేర్కొన్నారు. సెప్టెంబరు 24 నుంచి 29 మధ్య 200 జిల్లాలు.. అక్టోబర్ 10 నుంచి 15 మధ్యలో మిగిలిన జిల్లాల్లో సమావేశాలను నిర్వహిస్తామన్నారు.
ఇదీ చూడండి:- ఆన్లైన్ ఆఫర్ల వలలో పడితే.. తప్పదు భారీ మూల్యం