మరో రెండు రోజుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్యాంకుల్లో ఉండే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఖాతాల వార్షిక ముగింపునకు స్పెషల్ క్లియరింగ్ ఆపరేషన్స్‌ను చేపట్టాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆదేశించింది. అన్నీ బ్యాంకులు దీన్ని విధిగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ మార్చి 31లోపు పూర్తి కావాలని నోటిఫికేషన్లో పేర్కొంది. క్లియరింగ్‌కు తగినంత బ్యాలెన్స్‌ను ఖాతాల్లో కొనసాగించాలని ఆదేశించింది.
ప్రతీ బుధవారం లాగే క్లియరింగ్ సమయాలను మార్చి 31న కూడా అనుసరించాలని పేర్కొంది. ఆర్బీఐ అనుబంధ బ్యాంకులు, అర్బన్, స్టేట్ సహకార బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులతో పాటు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలకు కూడా ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని తెలిపింది.
ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వాలు విడుదల చేసిన చెక్కులను ఈ నెల 31 లోపు క్లియర్ చేయాలని కోరింది.
ఇదీ చూడండి: కీలక వడ్డీ రేట్లు మళ్లీ యథాతథం!