ETV Bharat / business

కరోనా దెబ్బకు కళ తగ్గిన బ్యాంకు షేర్లు - ప్రైవేటు బ్యాంకులు

కరోనా సంక్షోభం ధాటికి బ్యాంకు షేర్లు కళ తప్పుతున్నాయి. ఆర్థిక పతనం, వెంటాడుతున్న రాని బాకీల భారం వల్ల బ్యాంకులు సతమతమవుతున్నాయి. ఫలితంగా భారీగా అప్పులిచ్చే పరిస్థితి బ్యాంకులకు లేదు.

Bank shares diminished by the  corona crisis
కళ తగ్గిన బ్యాంకు షేర్లు
author img

By

Published : May 13, 2020, 9:02 AM IST

బ్యాంకు షేర్లపై మదుపరులకు ఆసక్తి కొరవడిందా? రికార్డు స్థాయిలో షేర్ల ధరలు పతనమైనా, వాటిని కొనుగోలు చేసేందుకు ముందుకు రావటం లేదా? ప్రస్తుత పరిస్థితులను, స్టాక్‌మార్కెట్లో బ్యాంకు షేర్ల కదలికలను చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా కనిష్ఠ స్థాయికి బ్యాంకు షేర్లు దిగిపోతున్నాయి. ఎక్కడా వాటికి 'కొనుగోళ్ల మద్దతు' కనిపించడం లేదు.

పీఎస్‌బీలు ఇలా...

మంగళవారం బీఎస్‌ఈలో 52 వారాల కనిష్ఠ ధరలను నమోదు చేసిన బ్యాంకుల షేర్లు ఎన్నో కనిపిస్తున్నాయి. అగ్రశ్రేణి ప్రభుత్వ బ్యాంకు ఎస్‌బీఐ షేర్‌ రూ.160.90 కి పడినా, చివర్లో కోలుకుని రూ.166.70 ముగింపు ధర నమోదు చేసింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ.39.40కి పడిపోయింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు రూ.27.95కు చేరినా, రూ.28.75 వద్ద ముగిసింది. కెనరా బ్యాంకు రూ.76 వరకూ పడి చివర్లో రూ.79.90 వద్ద ముగిసింది. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంకు, ఐఓబీ... తదితర బ్యాంకు షేర్ల స్థితీ ఇంతే.

ప్రైవేటు బ్యాంకులూ...

ప్రైవేటు రంగంలోని నాలుగైదు పెద్ద బ్యాంకులను మినహాయిస్తే, చిన్న- మధ్యస్థాయి ప్రైవేటు బ్యాంకుల షేర్లు కూడా గత 52 వారాల కనిష్ఠ స్థాయికి దగ్గరగా కనిపిస్తున్నాయి. సిటీ యూనియన్‌ బ్యాంకు, ధనలక్ష్మీ బ్యాంకు, ఆర్‌బీఎల్‌ బ్యాంకు, ఫెడరల్‌, కర్ణాటక బ్యాంకుల షేర్ల ధరలు బాగా దిగివచ్చాయి. పెద్ద బ్యాంకుల షేర్ల ధరలు సైతం 'కరోనా' ముందు కాలం నాటితో పోల్చితే 20- 25 శాతం దిగువున కనిపిస్తున్నాయి.

ఎందుకిలా?

దేశీయ బ్యాంకులకు కొంతకాలంగా రానిబాకీల భారం అధికంగా ఉంది. దేశవ్యాప్తంగా ‘లాక్‌డౌన్‌’ వల్ల కొత్తగా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇచ్చిన అప్పులకు వసూళ్లు తగ్గుతున్నాయి. సమీప భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్ధం కావటం లేదు. దేశ ఆర్థికాభివృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సున్నా శాతానికి పడిపోతుందని, లేదా 1-2 శాతానికి పరిమితం అవుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బ్యాంకు రుణాల్లో వృద్ధి అవకాశాలు తక్కువ. వసూలు కాని బాకీల మొత్తం పెరగొచ్చు. ఈ పరిస్థితుల నుంచి కోలుకోనికి ఒకటి, రెండేళ్లైనా పడుతుందని భావిస్తున్నారు. అందువల్ల ఇప్పటి నుంచే బ్యాంకు షేర్లపై పెట్టుబడి పెట్టడం ఎందుకనే ఆలోచన మదుపరుల్లో కనిపిస్తోందని స్టాక్‌మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆర్ధిక వ్యవస్థ స్వతరం కోలుకోని పక్షంలో, బ్యాంకుల ఆదాయాలు- లాభాలపై ఒత్తిడి ఇంకా పెరుగుతుందని, అటువంటి పరిస్థితుల్లో షేర్ల ధరలు ఇంకా దిగివచ్చే పరిస్థితి ఉంటుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

బ్యాడ్‌ బ్యాంకు వస్తోంది...!

రూ.60 వేల కోట్ల ఎన్‌పీఏ ఖాతాలతో ఏర్పాటు అవకాశం

దేశంలోని వాణిజ్య బ్యాంకులపై ఉన్న నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏ) భారాన్ని తగ్గించే లక్ష్యంతో బ్యాడ్‌ బ్యాంకు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏఆర్‌సీ (అస్సెట్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ) రూపంలో ఇటువంటి సంస్థ ఒకదాన్ని నెలకొల్పాలని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరనుందని తెలుస్తోంది. 'ఈ సంస్థ మూలధనంలో 50 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం సమకూర్చనున్నట్లు, ఈ మొత్తం రూ.9,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల వరకూ ఉండవచ్చని బ్యాంకింగ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. బ్యాంకులు తమ ఉన్న పెద్ద ఎన్‌పీఏ ఖాతాలను దీనికి బదిలీ చేస్తాయని, ఆ ఖాతాల మొత్తం రూ.60,000 కోట్లు ఉండవచ్చని తెలుస్తోంది. వాణిజ్య బ్యాంకులకు గత డిసెంబరు నాటికి దాదాపు రూ.9 లక్షల కోట్ల మేరకు రానిబాకీలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటాయే 80 శాతం. అందువల్ల ఏటా ప్రభుత్వరంగ బ్యాంకుల 'ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో' పెరుగుతూ వస్తోంది. బ్యాడ్‌ బ్యాంకు ఏర్పాటై ఎన్‌పీఏ ఖాతాలను దానికి బదిలీ చేసే అవకాశం లభిస్తే బ్యాంకుల ఆస్తి-అప్పుల పట్టీలు బాగా మెరుగుపడే అవకాశం ఏర్పడుతుంది.

COVID 19 IMPACT ON BANKING
కళ తగ్గిన బ్యాంకు షేర్లు

ఇదీ చూడండి: మార్చిలో భారీగా క్షీణించిన పారిశ్రామిక ఉత్పత్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.