పండుగల సీజన్ కావడం వల్ల అక్టోబర్ నెలలో బ్యాంకులకు వరుస సెలవులు ఉండనున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కలిపి మొత్తం 21 రోజుల సెలవు దినాలు ఆర్‌బీఐ గుర్తించింది. దేశవ్యాప్తంగా బ్యాంక్ సెలవుల తేదీలు, సెలవులకు కారణాలు ఇలా ఉన్నాయి.
అక్టోబర్ సెలవు దినాలు ఇవే..
- అక్టోబర్ 1: హాఫ్ ఇయర్లీ అకౌంట్స్ క్లోజింగ్ (సిక్కిం)
- అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి (అన్ని రాష్ట్రాల్లో)
- అక్టోబర్ 3: ఆదివారం
- అక్టోబర్ 6: మహాలయ అమావస్య (కర్ణాటక, త్రిపుర, బంగాల్)
- అక్టోబర్ 7: మేరా చౌరెల్ హౌబా(మణిపుర్)
- అక్టోబర్ 9: రెండో శనివారం
- అక్టోబర్ 10: ఆదివారం
- అక్టోబర్ 12: దుర్గా పూజ (మహా సప్తమి)- (బంగాల్, త్రిపుర)
- అక్టోబర్ 13: దుర్గా పూజ (మహా సప్తమి) - (బంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, త్రిపుర, సిక్కిం, మణిపుర్, అసోం)
- అక్టోబర్ 14: దుర్గా పూజ/ దసరా (మహా నవమి, ఆయుధ పూజ)- (తమిళనాడు, కర్ణాటక, బంగాల్, బిహార్, కేరళ, శ్రీనగర్)
- అక్టోబర్ 15: దసరా (విజయ దశమి)- దాదాపు అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు
- అక్టోబర్ 16: దుర్గా పూజ (సిక్కిం)
- అక్టోబర్ 17: ఆదివారం
- అక్టోబర్ 18: కటి బిహూ (అసోం)
- అక్టోబర్ 19: ఈద్-మిలాదున్‌నబి - దాదాపు అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు
- అక్టోబర్ 20: మహర్షి వాల్మీకి జయంతి/లక్ష్మీ పూజ- (కర్ణాటక, త్రిపుర, చండీగఢ్)
- అక్టోబర్ 22: ఈద్-మిలాదున్‌నబి (జమ్ము, శ్రీనగర్)
- అక్టోబర్ 23: నాల్గో శనివారం
- అక్టోబర్ 24: ఆదివారం
- అక్టోబర్ 26: విలీన దినోత్సవం (జమ్ము, శ్రీనగర్)
- అక్టోబర్ 31: ఆదివారం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయానికొస్తే విషయానికొస్తే.. గాంధీ జయంతి, దసరా, ఈద్-మిలాదున్‌నబి రోజుల్లో బ్యాంకులు పని చేయవు. వీటితో పాటు.. రెండో శనివారం, నాల్గో శనివారం సహా అన్ని అదివారాలు బ్యాంకులు సాధారణ సెలవులో ఉంటాయి.
ఇవీ చదవండి: