ఆర్థిక మందగమన భయాలు, బీఎస్-6కు మారుతూ తయారీ సంస్థలు ఉత్పత్తి తగ్గించడం వల్ల వాహన అమ్మకాలు పడిపోయాయి. ఫిబ్రవరిలో 19.08 శాతం క్షీణత నమోదైంది. అన్ని విభాగాలలో కలిపి గత నెలలో మొత్తం 16,46,332 వాహనాలు మాత్రమే అమ్ముడుపోయాయి.
2019 ఫిబ్రవరి నెలలో 20,34,597 వాహన విక్రయాలు జరిగాయి. ఈ మేరకు భారత ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య-సియామ్ వివరాలు వెల్లడించింది.
"రిజిస్ట్రేషన్లలో కొత్త నిబంధనలు, బీఎస్-6 వాహనాలను ముందుగా బుక్ చేసుకునేందుకు వినియోగదారులు అడ్వాన్సులు చెల్లించడం వంటి కారణాలు కూడా ఫిబ్రవరిలో వాహన విక్రయాలపై ప్రభావం చూపాయి. కరోనా వైరస్ కారణంగా చైనా నుంచి వాహన విడిభాగాలు నిలిచిపోవడమూ వాహన పరిశ్రమపై కొంత మేర ప్రభావం చూపింది."
-సియామ్ నివేదిక
దేశీయ వాహన విక్రయాలు ఫిబ్రవరిలో 7.61 శాతం, కార్లు 8.77 శాతం, ద్విచక్ర వాహనాలు 19.82 శాతం, మోటారు సైకిల్ అమ్మకాలు 22.02 శాతం తగ్గాయి. వాణిజ్య వాహన విక్రయాలు 32.9 శాతం తగ్గినట్లు సియామ్ వెల్లడించింది.
ఇదీ చూడండి: కోలుకున్న మార్కెట్లు- సెన్సెక్స్ రికార్డు రికవరీ