ఆటోఎక్స్‌పో 2020లో రెండోరోజు హ్యూందాయ్ క్రెటా, మారుతీ విటార బ్రెజా వంటి ప్రతిష్ఠాత్మక వాహనాల అప్‌గ్రేడెడ్ మోడళ్లను ప్రదర్శించారు. ఇక బెంజ్ సంస్థ భారత్‌లో తొలిసారి విడుదల చేయనున్న మార్కోపోలో క్యాంపర్‌ను ప్రదర్శించింది. ఇది పలువురి దృష్టిని ఆకట్టుకొంది. వీటితోపాటు మరెన్నో స్టార్టప్‌లు తమ వాహనాలను ప్రదర్శించాయి. ఆ విశేషాలు మీకోసం..
- ఆటో ఎక్స్‌పో రెండో రోజు అప్రిల్లా ఎస్‌ఎక్స్‌ఆర్ 160 మోటోస్కూటర్‌ను ప్రదర్శించారు. దీని బుకింగ్స్‌ను ఆగస్టు నుంచి ప్రారంభించనున్నారు. మూడో త్రైమాసికంలో విడుదల చేస్తారు. దీంతోపాటు ఎలక్ట్రిక్ వెస్పాను కూడా ప్రదర్శనకు తీసుకొచ్చారు. ఈ ప్రదర్శన కార్యక్రమంలో పియాజియో వెహికల్స్ భారతీయు విభాగం సీఈవో, ఎండీ డియాగో గ్రిఫ్ పాల్గొన్నారు.
- విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ మార్కోపోలో కారును ప్రదర్శనకు తీసుకొచ్చింది. ఇది బెంజ్‌లోని వి క్లాస్ శ్రేణికి చెందింది. భారత్‌లో బెంజ్ విడుదల చేసిన తొలి విలాసవంతమైన క్యాంపర్ ఇదే కావడం విశేషం. ఈ కారుకు బుకింగ్స్‌ను కూడా నేటి నుంచే ప్రారంభించనున్నారు.
- ఇక జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ సంస్థ ఐడీ, క్రోజ్ మోడళ్లను ఆటోఎక్స్‌పోలో ప్రదర్శించింది. దీంతోపాటు 2020 పోలోకప్ రేస్‌కారును ప్రదర్శించింది.
- మారుతీ సుజుకీ కాంపాక్ట్ ఎస్‌యూవీ విటారా బ్రెజ ఫేస్‌లిఫ్ట్ ఎడిషన్‌ను ఆటోఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఈ కారు లుక్స్‌లో చాలా మార్పులు చేసింది. దీనికి 16 అంగుళాల అలాయ్ వీల్స్‌ను, టాప్ వేరియంట్‌లో రెండు రంగుల్లో(డ్యూయల్ టోన్) అందించనుంది.
- ఈవ్ స్టార్టప్ ఒక ఎలక్ట్రిక్ బైక్, మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ ఫోర్సెటీ, ఈ బైక్ టెసోరోను వినియోగదారులకు చూపించింది. స్కూటర్ గంటకు అత్యధికంగా 70 కిమీ, బైక్ గంటకు అత్యధికంగా 100 కిమీ వేగంతో ప్రయాణిస్తాయి. వీటి ఛార్జింగ్‌కు 3-4గంటలు పడుతుంది. వీటిల్లో రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. ఒకదానితో కూడా ఇవి నడుస్తాయి. బైక్‌లకు ఐదేళ్ల వారెంటీ.. బ్యాటరీకి మూడేళ్ల వారెంటీ ఇస్తోంది.
- దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ సరికొత్త మోడల్‌ను విడుదల చేసింది. కంపెనీ ప్రచారకర్త షారుక్ ఖాన్ పాల్గొన్నారు. దీంతోపాటు కంపెనీ ఉన్నత స్థాయి ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. ఈ కారును వచ్చెనెల భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.
- మహీంద్రా సంస్థ ఎంస్టాలియోన్ రకం పెట్రోల్ ఇంజిన్లను ఆటోఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఇవి 1.2 లీటర్, 1.5 లీటర్, 2.0 లీటర్ ఇంజిన్లను ఉంది. ఈ ఇంజిన్లను కేవీయూ 100 నుంచి ఎక్స్‌యూవీ 500 మధ్య ఉన్న వాహనాల బీఎస్-6 మోడళ్లలో అమర్చనున్నారు.
- బర్డ్ ఎలక్ట్రిక్ సంస్థ హైమా ప్రొటోటైప్ కార్‌ను ప్రదర్శించింది.
ఇదీ చూడండి: 'వాట్సాప్ పే'కు ఎన్‌పీసీఐ అనుమతి