ETV Bharat / business

నీరవ్​ మోదీ ఆస్తులు జప్తు చేసిన ఈడీ - offenders act

Assets of Nirav Modi worth Rs 329.66 crore confiscated
నీరవ్​ మోదీ ఆస్తులు జప్తు చేసిన ఈడీ
author img

By

Published : Jul 8, 2020, 5:06 PM IST

Updated : Jul 8, 2020, 5:37 PM IST

17:30 July 08

వజ్రాల వ్యాపారి, పంజాబ్​ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్​ మోదీకి చెందిన.. రూ. 329.66 కోట్ల విలువైన ఆస్తుల్ని జప్తు చేసింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​. పారిపోయిన ఆర్థిక నేరస్థుల చట్టం ప్రకారం.. ఆస్తులను అటాచ్​ చేసింది. 

జప్తు చేసిన ఆస్తుల్లో ముంబయి ఒర్లిలో ఉన్న సముద్ర మహల్​ భవనంలోని నాలుగు ఫ్లాట్లు, అలీబాగ్​లోని భూమి, ఓ ఫాం హౌస్​, జైసల్మేర్​లో విండ్​ మిల్​, లండన్, యూఏఈల్లోని ఫ్లాట్లు, బ్యాంకు డిపాజిట్లు, షేర్లు ఉన్నాయి.  

జూన్​ 8నే అనుమతి..

అతని ఆస్తులు జప్తు చేసేందుకు ముంబయిలోని ప్రత్యేక కోర్టు.. జూన్​ 8న అనుమతిచ్చింది. గతేడాది డిసెంబర్​ 5నే నీరవ్​ను ఇదే న్యాయస్థానం ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించింది. 

మనీలాండరింగ్​ నిరోధక చట్టం కింద.. ఇప్పటివరకు నీరవ్​ మోదీకి చెందిన రూ. 2,348 కోట్ల విలువైన ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది ఈడీ. 2019 మార్చిలో అరెస్టయిన నీరవ్​ ప్రస్తుతం.. లండన్​ జైలులో ఉన్నాడు.  

17:01 July 08

నీరవ్​ మోదీ ఆస్తులు జప్తు చేసిన ఈడీ

వజ్రాల వ్యాపారి, పంజాబ్​ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్​ మోదీకి చెందిన.. రూ. 329.66 కోట్ల విలువైన ఆస్తుల్ని జప్తు చేసింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​.

Last Updated : Jul 8, 2020, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.