ETV Bharat / business

విదేశాల నుంచి రూ.4 లక్షల కోట్ల బదిలీ తగ్గొచ్చు - ఆసియా అభివృద్ధి బ్యాంక్

కొవిడ్‌ వల్ల విదేశాల్లో ఉపాధి/రాబడి తగ్గడంతో, ఈసారి ఆసియా పసిఫిక్ దేశాలకు నగదు బదిలీ తగ్గొచ్చని ఏషియన్‌ డెవలప్‌మెంట్‌బ్యాంక్‌ అంచనా వేసింది. ఇందువల్ల పలు కుటుంబాలు పేదరికంలోకి జారిపోవచ్చని పేర్కొంది.

Asia-Pacific may see $31.4-54.3 billion remittance losses due to Covid-19: ADB
విదేశాల నుంచి రూ.4 లక్షల కోట్ల బదిలీ తగ్గొచ్చు
author img

By

Published : Aug 10, 2020, 5:35 AM IST

కొవిడ్‌ వల్ల దాదాపు అన్ని దేశాల్లో ఉపాధి అవకాశాలు తగ్గడం, ఉద్యోగ కోతలు అనివార్యమయ్యాయి. ముఖ్యంగా వర్థమాన దేశాల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. ఈ దేశాల నుంచి విదేశాలకు వలసవెళ్లి, సంపాదించిన దాంట్లో అధికమొత్తాన్ని తమ స్వస్థలాల్లోని కుటుంబీకులకు పంపడం (రెమిటెన్స్‌) ఎక్కువ. ప్రపంచం మొత్తంమీద ఇలా వెళ్లే కార్మికుల్లో మూడోవంతు మంది ఆసియా-పసిఫిక్‌ దేశాల నుంచే ఉంటారు.

కొవిడ్‌ వల్ల ఆయా దేశాల్లో ఉపాధి/రాబడి తగ్గడంతో, ఈసారి రూ.2.35-4.0 లక్షల కోట్ల (3140-5430 కోట్ల డాలర్ల) నగదు బదిలీ ఆసియా పసిఫిక్‌ దేశాలకు తగ్గొచ్చని ఏషియన్‌ డెవలప్‌మెంట్‌బ్యాంక్‌ అంచనా వేసింది. ఇందువల్ల పలు కుటుంబాలు పేదరికంలోకి జారిపోవచ్చని పేర్కొంది. 2019లో ఈ దేశాలకు 31500 కోట్ల డాలర్ల (సుమారు రూ.23.62 లక్షల కోట్లు) నగదు ఈ విధంగా బదిలీ అయ్యింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.