ETV Bharat / business

ప్రైవేటు ఉద్యోగులకు త్వరలోనే ఇంక్రిమెంట్లు!

భారత్​లోని 59 శాతం కంపెనీలు తమ ఉద్యోగుల వేతనాలను పెంచేందుకు కసరత్తులు చేస్తున్నాయి. 5 నుంచి 10 శాతం మధ్య ఇంక్రిమెంట్ ఇవ్వాలని కంపెనీలు యోచిస్తున్నాయి. ఈ విషయం ఓ సర్వేలో వెల్లడైంది.

As economy recovers, survey shows 59 pc firms in India intend to give salary increments in 2021
ప్రైవేటు ఉద్యోగులకు త్వరలోనే ఇంక్రిమెంట్లు!
author img

By

Published : Apr 14, 2021, 5:48 AM IST

కరోనా విజృంభణతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో పలు సంస్థలు సైతం ఉద్యోగులకు తీపి కబురు చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి. ఓ సర్వే ప్రకారం భారత్​లోని 59 శాతం కంపెనీలు తమ ఉద్యోగులకు శాలరీ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని యోచిస్తున్నాయి.

దీనిపై జీనియస్ కన్సల్టెంట్స్ అనే సంస్థ.. 'టెన్త్​ హైరింగ్, అట్రిషన్ అండ్ కాంపెన్సేషన్ ట్రెండ్ 2021-21' పేరిట సర్వే నిర్వహించింది. 1200 కంపెనీలను ఫిబ్రవరి-మార్చిలో ఆన్​లైన్ ద్వారా సర్వే చేసి ఈ ఫలితాలను రూపొందించింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, నిర్మాణం, ఇంజినీరింగ్, ఎడ్యుకేషన్/టీచింగ్/ట్రైనింగ్, ఎఫ్ఎంసీజీ, ఆతిథ్యం, హెచ్ఆర్ సొల్యూషన్స్, ఐటీ, ఐటీఈఎస్, బీపీఓ, లాజిస్టిక్స్, తయారీ, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, మెడికల్, పవర్, ఎనర్జీ, రియల్ ఎస్టేట్, రిటైల్, టెలికాం, ఆటో, అనుషంగిక రంగాలకు చెందిన సంస్థలను సర్వే చేసి దీన్ని రూపొందించింది.

"ఈ ఏడాది ఇంక్రిమెంట్ల విషయంలో కంపెనీలు సానుకూలంగా ఉన్నాయి. 59 శాతం కంపెనీలు ఇంక్రిమెంట్ ఉందని చెబుతున్నాయి. 5-10 శాతం ఇంక్రిమెంట్ ఉంటుందని భావిస్తున్నారు. 20 శాతం కంపెనీలు ఇంక్రిమెంట్ 5 శాతం కన్నా తక్కువగా ఉంటుందని భావిస్తున్నాయి. 2021లోనూ ఇంక్రిమెంట్ ఉండదని 21 శాతం కంపెనీలు స్పష్టం చేశాయి."

-సర్వే

కొత్త రిక్రూట్​మెంట్ ఉంటుందని 43 శాతం మంది భావిస్తున్నట్లు దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో వెల్లడైంది. దక్షిణ భారతదేశంలో కొత్త నియామకాలు ఎక్కువగా ఉంటాయని 37 శాతం మంది అభిప్రాయపడ్డారు. రీప్లేస్​మెంట్ నియామకాలు ఉంటాయని 41 శాతం మంది తెలిపారు. కాగా, 11 శాతం మాత్రం ఎలాంటి కొత్త నియామకాలు ఉండవని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'పెట్రో​ ధరలు తగ్గేది అప్పుడే..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.