యాపిల్ సంస్థ తన ఫోన్లకు ప్రత్యేకంగా ఆపరేటింగ్ సిస్టమ్‌ను తయారు చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఐఓఎస్ 14ను అప్‌డేట్ చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు టెక్‌నిపుణులు చెబుతున్నారు. ఐఓఎస్ 15 కోసం యాపిల్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్‌ఫోన్ ఓఎస్‌లలో యాపిల్‌కు ప్రధాన ప్రత్యర్థి అయిన.. గూగుల్ ఇప్పటికే ఆండ్రాయిడ్ 12ను తీసుకొచ్చేసింది. ఐఓఎస్ 14 వెర్షన్‌కు అప్‌డేట్‌గా మరిన్ని ఫీచర్లతో ఐఓఎస్ 15 వెర్షన్ వచ్చే అవకాశం ఉంది. జూన్‌లో జరగనున్న యాపిల్ వార్షిక సమ్మిట్ (యాపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్)లో అధికారిక ప్రకటన చేయొచ్చని సమాచారం. వెర్షన్ అప్‌డేషన్‌కు సంబంధించి ఫీచర్ల గురించి వెల్లడించే అవకాశం ఉంది. గత సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా కరోనా మహమ్మారి కారణంగా ఆన్‌లైన్ వేదికగా సమ్మిట్ జరిగొచ్చు.
అంతకుముందు వెర్షన్ల కంటే ఐఓఎస్ 14 అప్‌డేషన్ సరికొత్త ఆప్షన్లతో వచ్చింది. ప్రత్యేకంగా యాప్‌ను ఓపెన్ చేయకుండానే హోం స్క్రీన్ విడ్జెట్‌లోనే సమాచారమంతా కనిపించేలా అప్‌డేట్ చేసింది. అయితే కొత్తగా తీసుకురాబోయే వెర్షన్‌లో యూఐ(యూజర్ ఇంటర్‌ఫేస్)లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని, ఇప్పటికే ఉన్న ఆప్షన్లను మెరుగుపరిస్తే సరిపోతుందని సాంకేతిక నిపుణులు అభిప్రాయపడ్డారు. ఐఓఎస్ 15 వెర్షన్‌లో యూజర్లకు ఇంటరాక్ట్ విడ్జెట్లను పరిచయం చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఉన్న వాటితో పోలిస్తే కొత్త వెర్షన్‌లో తీసుకురానున్న విడ్జెట్లు మరింత సౌకర్యంగా ఉండనున్నట్లు సమాచారం. ఐఫోన్ 12, ఐఫోన్ 11, ఐఫోన్ 8, ఐఫోన్ 7 సిరీస్‌ల్లోని డివైజ్‌లలో ఐఓఎస్ కొత్త వెర్షన్ అప్‌డేట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
భారత్‌లో ఐఓఫోన్ 12 తయారీ
స్థానిక వినియోగదార్ల కోసం భారత్‌లో ఐఫోన్ 12 తయారీని ప్రారంభించనున్నట్లు యాపిల్ ప్రకటించింది. 2017 నుంచే ఈ కంపెనీ ఐఫోన్లను భారత్‌లో తయారు చేయిస్తోంది. చైనా నుంచి కొంత ఉత్పత్తిని భారత్‌కు అప్పట్లో బదిలీ చేసింది. ప్రస్తుతం తన కాంట్రాక్ట్ తయారీ భాగస్వాములైన ఫాక్స్‌కాన్, విస్ట్రాన్‌ల ద్వారా ఐఫోన్ ఎస్‌ఈ(2020), ఐఫోన్ ఎక్స్‌ఆర్, ఐఫోన్ 11లను మన దేశంలో ఉత్పత్తి చేస్తోంది. తాజాగా ఐఫోన్ 12 మోడళ్లనూ ఇక్కడే తయారు చేయనుంది. అయితే ప్రొ మోడళ్లను మాత్రం చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది. 2020లో భారత్‌లో తన మార్కెట్ వాటాను యాపిల్ రెట్టింపు చేసుకుంది. డిసెంబరు 2019లో ఈ కంపెనీ వాటా 2 శాతంగా ఉండగా.. డిసెంబరు 2020 త్రైమాసికానికి 4 శాతానికి చేరడం విశేషం. సంస్థ విక్రయాల్లో ఐఫోన్ ఎస్‌ఈ(2020) వాటానే 30 శాతంగా ఉండగా.. ఐఫోన్ 11, ఐఫోన్ ఎక్స్‌ఆర్‌లు 27%, 14% చొప్పున పొందాయి. మిగతా వాటా ఐఫోన్ 12కు ఉంది. ఐఫోన్ 12 తయారీని భారత్‌కు బదిలీ చేయడం వల్ల, ఐఫోన్ 13 విడుదలలో ఆలస్యాన్ని పరిహరించవచ్చని యాపిల్ భావిస్తోంది.
ఇదీ చదవండి:విద్యార్థుల భావాల్ని కనిపెట్టే కృత్రిమ మేధ!