ETV Bharat / business

చైనా కౌంటర్​ ఎటాక్​- 4,500 గేమ్స్​ డిలీట్​ - చైనా కొత్త నిబంధనలతో గేమ్ డెవలపర్లకు చిక్కులు

చైనా యాప్ స్టోర్ నుంచి భారీ సంఖ్యలో గేమ్​లను తొలగించింది యాపిల్. చైనా ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగటం వల్ల కేవలం రెండు రోజుల్లో 3 వేలకుపైగా గేమ్​లను తొలగించించింది. మొత్తం మీద 4,500 గేమ్​లను యాప్​ స్టోర్ నుంచి డిలీట్ చేసింది.

apple remove games from app store
యాపిల్ స్టోర్ నుంచి భారీగా గేమ్​లు తొలగింపు
author img

By

Published : Jul 6, 2020, 1:10 PM IST

టెక్​ దిగ్గజం యాపిల్ చైనా యాప్​ స్టోర్ నుంచి 4,500 గేమ్​లను తొలగించింది. తమ నిబంధనలు పాటించని యాప్​లపై చర్యలు తీసుకోవాలని చైనా ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఇందులో 3,000లకుపైగా గేమ్​లను గత వారమే... అది కూడా రెండు రోజుల్లోనే తొలగించింది యాపిల్. ఈ స్థాయిలో గేమ్​లను తొలగించడం ఇదే ప్రథమం.

ఇటీవలే 59 చైనా యాప్​లపై భారత్ నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

కొత్త నిబంధనలు..

జూలై 1 నుంచి చైనా కొత్త ఇంటర్నెట్ పాలసీ అమలు చేస్తోంది.

కొత్త నిబంధనల ప్రకారం చైనా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నాకే గేమ్​ డెవలపర్​లు.. తమ గేమ్​లు యాపిల్​ యాప్​ స్టోర్​లో అప్​లోడ్ చేయాలి.

అయితే ఈ నిబంధలు గేమ్​ డెవలపర్లపై తీవ్ర ప్రభావం చూపుతాయని యాపిల్ చైనా మార్కెటింగ్ ప్రతినిధి తెలిపారు. చైనా ఏడాదికి 1,500 గేమ్​లకు మాత్రమే లైసెన్సులు ఇస్తుందని చెప్పుకొచ్చారు. గేమ్​లకు లైసెన్స్ ఇచ్చే ప్రక్రియ పూర్తి చేసేందుకు చైనా ఆరు నెలల నుంచి ఏడాది వరకు సమయం తీసుకుంటుందని వెల్లడించారు. దీని వల్ల గేమ్​ డెవలపర్లు అనుమతుల కోసం దీర్ఘ కాలంపాటు వేచి చూడాల్సి వస్తుందని అన్నారు.

చైనా తీసుకొచ్చిన కొత్త పాలసీలతో దాదాపు 20 వేల యాప్​లపై ప్రభవం పడొచ్చని తెలుస్తోంది.

సెన్సర్ టవర్ డేటా ప్రకారం యాపిల్ యాప్ స్టోర్​కు చైనా అతిపెద్ద మార్కెట్. యాప్​ స్టోర్ ద్వారా చైనాలో ఏడాదికి 16.4 బిలయన్ డాలర్లు గడిస్తుంది. అమెరికాలో ఇది 15.4 బిలియన్ డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:వైరస్​ను కడిగే ఫోన్​ సోప్​ గురించి తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.