దేశీయ స్పోర్ట్స్ బైక్‌లలో మంచి ఆదరణ పొందుతున్న అపాచీ మోడల్స్‌లో టాప్ఎండ్ బైక్‌ను తీసుకురానుంది టీవీఎస్ మోటార్. న్యూ టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 పేరుతో ఏప్రిల్ 8న ఈ కొత్త మోడల్ మార్కెట్లోకి రావాల్సి ఉండగా.. అది కాస్త ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. బైక్ బాడీకి సంబంధించి మార్పులు చేయడమే ఇందుకు కారణం. బైక్‌కు ప్రస్తుతం ఉన్నట్లుగా కాకుండా హెడ్ ల్యాంప్ డిజైన్‌ను కొంత మేర మారుస్తారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఈ బైక్ రంగుల్లోనూ మార్పు ఉంటుందని సమాచారం. పూర్తిస్థాయి సమాచారం తెలియాలి అంటే కంపెనీ నుంచి ప్రకటన రావాల్సిందే.
అపాచీ ఆర్ఆర్ 310 ధర రూ. 2.5 లక్షలు ఉండొచ్చని అంచనా.
ప్రత్యేకతలు..
- లో స్పీడ్ రైడింగ్ కోసం గ్లైడ్ త్రూ టెక్నాలజీ
- డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్
- 5 అంగుళాల కలర్ డిస్ప్లే
- సింగిల్ సిలిండర్ మోటార్
ఇదీ చూడండి: కొత్త మోడళ్ల రాకతో ఈ నెల బైక్ లవర్స్‌కు పండగే!