ఎక్కువగా ప్రయాణాలు చేసే వారు తమకు సొంత క్యారవాన్ ఉంటే బాగుంటుందని కలలు కంటారు. కానీ, ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా మంది కల కలగానే మిగిలిపోతుంది. అలాంటి వారి కలలను నిజం చేస్తూ ఆటో రిక్షాలో, అత్యంత తక్కువ ధరలో, అన్ని హంగులతో మొబైల్ హౌస్‌ను రూపొందించాడు తమిళనాడు నమక్కల్‌కు చెందిన ఎన్జీ అర్జున్ ప్రభు.
2019లో మూడు చక్రాల ఆటోపై ఉన్న కొద్ది స్థలంలోనే 'సోలో:01- మొబైల్ హౌస్'ను రూపొందించాడు ప్రభు. ఇందుకోసం రూ.లక్ష ఖర్చు చేశాడు. ఇందులో చిన్న కిచెన్, పడక గది, బాత్రూమ్, టాయిలెట్, హాల్, టెర్రస్ వంటివి ఉండటం విశేషం. ఇలా 36 చదరపు అడుగుల్లోనే పోర్టబుల్ ఇంటిని రూపొందించి అందరి మన్ననలు పొందుతున్నాడు ప్రభు.
ఎంఏఆర్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ స్వర్ణభూమి(ఎమ్ఐడీఏఎస్)లో ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు అర్జున్. ట్రక్కులు, చిన్న వాహనాల బాడీలను రీడిజైనింగ్ చేయటంలో ప్రసిద్ధి చెందాడు.
ఇలాంటి పోర్టబుల్ ఇళ్లు.. టెంట్లలో నివసించే సంచార వర్గాల వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
ఆనంద్ మహీంద్రా ప్రశంసలు..
ఈ సోలో:01 మొబైల్ హౌస్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా వరకు చేరాయి. ప్రభూ ఆలోచనకు ఆయన ఫిదా అయ్యారు. ఆ యువకుడిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.
"చిన్న స్థలాల శక్తిని తెలిపేందుకు అర్జున్ ఈ పని చేశారు. అలాగే కరోనా తర్వాత ప్రయాణాలు చేసేందుకు గొప్ప ట్రెండ్‌ను సృష్టించనున్నారు. అతను బొలెరో పికప్పైనా మరింత ప్రతిష్టాత్మక హౌస్‌కు రూపకల్పన చేస్తారా? అని నేను అడగాలనుకుంటున్నా. ఎవరైనా అర్జున్ను ఎలా సంప్రదించాలో చెబుతారా?" అని పేర్కొన్నారు.
-
Apparently Arun did this to demonstrate the power of small spaces. But he was also on to a larger trend: a potential post-pandemic wanderlust & desire to be ‘always mobile.’ I’d like to ask if he’ll design an even more ambitious space atop a Bolero pickup. Can someone connect us? https://t.co/5459FtzVrZ
— anand mahindra (@anandmahindra) February 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Apparently Arun did this to demonstrate the power of small spaces. But he was also on to a larger trend: a potential post-pandemic wanderlust & desire to be ‘always mobile.’ I’d like to ask if he’ll design an even more ambitious space atop a Bolero pickup. Can someone connect us? https://t.co/5459FtzVrZ
— anand mahindra (@anandmahindra) February 27, 2021Apparently Arun did this to demonstrate the power of small spaces. But he was also on to a larger trend: a potential post-pandemic wanderlust & desire to be ‘always mobile.’ I’d like to ask if he’ll design an even more ambitious space atop a Bolero pickup. Can someone connect us? https://t.co/5459FtzVrZ
— anand mahindra (@anandmahindra) February 27, 2021
ఇదీ చూడండి: ఇల్లెక్కిన స్కార్పియో.. మహీంద్రా ఫిదా