కొవిడ్ చికిత్స సమయంలో వస్తున్న బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ నివారణకు వాడే యాంఫోటెరిసిన్ బీ ఇంజెక్షన్ తయారీ నిమిత్తం జెనెటిక్ లైఫ్సైన్సెస్కు ఎఫ్‌డీఏ అనుమతి లభించింది. ఎఫ్‌డీఏ అనుమతి కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. కంపెనీ వార్దా ప్లాంట్ల్లో వచ్చే 15 రోజుల్లో ఉత్పత్తి ప్రారంభంకానుంది.
ప్రస్తుతం ఈ ఇంజెక్షన్ ఖరీదు రూ.7000గా ఉండడం, దీనితో పాటు దేశీయంగా తీవ్ర కొరత నెలకొంది. జెనెటిక్ లైఫ్‌సైన్సెస్ మాత్రం ఈ ఇంజెక్షన్‌ను కూ.1200 కే అందించనుంది. రోజుకు ఈ ప్లాంట్‌లో 20 వేల ఇంజెక్షన్లు తయారు చేయనున్నారు. ఇప్పటికే ఈ సంస్థ కొవిడ్ చికిత్సలో వాడుతున్న రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లనూ తయారు చేస్తోంది.
ఇదీ చూడండి: కర్ణాటక, మహారాష్ట్రల్లో భారత్ బయోటెక్ యూనిట్లు