ETV Bharat / business

అమెజాన్ ప్రైమ్​లో ఇక లైవ్​ టీవీ ప్రసారాలు! - live TV in prime

వినియోగదారుల కోసం త్వరలోనే లైవ్​ టీవీ ప్రసారాలను ప్రారంభించే యోచనలో ఉంది అమెజాన్​. వార్తా ఛానళ్లు, మ్యూజిక్​, స్పోర్ట్స్​, అవార్డు షోలు, ప్రత్యేక కార్యక్రమాలను వీక్షించేలా కొత్త ఆప్షన్​ను ప్రైమ్​లో అందుబాటులోకి తీసుకురానుంది.

Amazon to add live TV to Prime Video: Report
అమెజాన్ ప్రైమ్​లో త్వరలోనే లైవ్​ టీవీ ప్రసారాలు!
author img

By

Published : Jun 25, 2020, 10:54 AM IST

Updated : Jun 25, 2020, 11:24 AM IST

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్.. వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రైమ్​లో ఇక నుంచి 24 గంటలపాటు వార్తా ఛానళ్లు, స్పోర్ట్స్​, మ్యూజిక్, అవార్డు కార్యక్రమాలు, ప్రత్యేక షోలు చూసేలా కొత్త ఆప్షన్​ను అందుబాటులోకి తీసుకురానుంది.

ఈ విషయంపై అమెజాన్​ అధికారిక ప్రకటన చేయనప్పటికీ ప్రిన్సిపల్​ ప్రోడక్ట్​ మేనేజర్​ పోస్టు కోసం దరఖాస్తులు అహ్వానించడాన్ని చూస్తే అది స్పష్టం అవుతోంది. ప్రైమ్​వీడియో లీనియర్​ టీవీ విభాగంలో ఈ పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. 24 గంటల టీవీ కంటెంట్​ను నిర్వహించేందుకు సాంకేతిక అనుభవం ఉన్నవారికి అవకాశం ఇవ్వనున్నట్లు జాబ్​ లిస్టింగ్​లో పేర్కొంది.

నెట్​ఫ్లిక్స్​, డిస్నీ ప్లస్​ వంటి ఓటీటీ సంస్థలు ఇప్పటికే టీవీ ఛానళ్ల ప్రసారాలను వినియోగదారులకు అందుబాటులో ఉంచాయి. వాటి నుంచి పోటీ ఎదుర్కొనేందుకే అమెజాన్​ ప్రైమ్​ కూడా ఈ సేవలను ప్రారంభించనుంది.

Last Updated : Jun 25, 2020, 11:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.