ETV Bharat / business

అమెజాన్​పై కేంద్రం చర్యలు-పేటీఎం, గూగుల్​కు సమన్లు! - Lok Sabha Secretariat noticE

అమెజాన్​పై కేంద్రం చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు-2019కి సంబంధించి పార్లమెంటు కమిటీ ముందు హాజరుకాకపోవడమే ఇందుకు కారణం. గూగుల్​, పేటీఎం ప్రతినిధులు అక్టోబర్​ 29న తమ ఎదుట హాజరుకావాలని కమిటీ సమన్లు జారీ చేసింది.

Amazon has refused to appear before Joint Committee of Parliament on Data Protection Bill on Oct 28
అమెజాన్​పై కేంద్రం చర్యలు-పేటీఎం, గూగుల్​కు సమన్లు!
author img

By

Published : Oct 23, 2020, 2:05 PM IST

వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు-2019పై నియమించిన పార్లమెంట్​ సంయుక్త కమిటీ ఎదుట హాజరయ్యేందుకు అమెజాన్​ నిరాకరించింది. ఈ విషయాన్ని ప్యానెల్​ చీఫ్​, భాజపా నాయకురాలు మీనాక్షి లేఖి వెల్లడించారు. అమెజాన్​ నిర్ణయం ప్రత్యేక హక్కులను ఉల్లంఘించడమేనని తెలిపిన ఆమె.. ఆ సంస్థపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పష్టం చేశారు.

ఫేస్​బుక్​ పబ్లిక్​ పాలసీ హెడ్​ అంఖి దాస్​.. కమిటీ ముందు హాజరైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గూగుల్​, పేటీఎం సంస్థలు.. అక్టోబర్​ 29న తమ ఎదుట హాజరుకావాలని కమిటీ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.