ETV Bharat / business

2019లో సుందర్​ పిచాయ్ పారితోషికం అన్ని వేల కోట్లా? - సుందర్​ పించాయ్ లేటెస్ట్ న్యూస్

గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్​ పిచాయ్​ 2019 సంవత్సరానికి గాను 280 మిలియన్ డాలర్లకు పైగా పారితోషికం అందుకున్నారు. ఈ విషయాన్ని రెగ్యులేటరికి సమర్పించిన నివేదికలో ఆల్ఫాబెట్ పేర్కొంది. 2019 డిసెంబర్​ నుంచి ఆల్ఫాబెట్​ సీఈఓగా సుందర్​ పిచాయ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

sunder pichai
సుందర్​ పిచాయ్​
author img

By

Published : Apr 26, 2020, 11:12 AM IST

చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) సుందర్‌ పిచాయ్‌కి 2019 సంవత్సరానికి గాను 280 మిలియన్‌ డాలర్లకుపైగా (దాదాపు రూ.21,364 కోట్లు)పారితోషికం చెల్లించినట్టు గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ ప్రకటించింది. దీనితో ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందుతున్న సీఈఓల జాబితాలో ఒకరిగా సుందర్‌ పిచాయ్‌ నిలిచారు.

భారత్‌కు చెందిన 47 ఏళ్ల సుందర్​ పిచాయ్‌ 2019 డిసెంబర్ 3న ఆల్ఫాబెట్‌ సీఈఓగా నియమితులయ్యారు.

పిచాయ్‌ పారితోషికంలో అధిక భాగం స్టాక్‌ అవార్డుల రూపంలో చెల్లించారు. అంటే మార్కెట్‌లో ఆల్ఫాబెట్‌ షేర్ల హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఆయన వార్షిక వేతనాన్ని లెక్కిస్తారు.

గత సంవత్సరానికి గాను పిచాయ్‌ వేతనం 6,50,000 డాలర్లు. ప్రస్తుతం దీనిని 2 మిలియన్‌ డాలర్లకు పెంచినట్టు ఆల్ఫాబెట్‌ వెల్లడించింది.

కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం...

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆల్ఫాబెట్‌లో ఈ సంవత్సరం ఉద్యోగాలు, పెట్టుబడి ప్రణాళికల విషయంలో గణనీయంగా కోత విధిస్తూ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ చూడండి:కరోనా తర్వాతా 'వర్క్ ఫ్రమ్​ హోమ్'​ కొనసాగింపు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.